యూఎస్‌లో పాక్‌ సైనికుల శిక్షణ పునరుద్ధరణ
close
Updated : 04/01/2020 14:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యూఎస్‌లో పాక్‌ సైనికుల శిక్షణ పునరుద్ధరణ

పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రాధాన్యం

వాషింగ్టన్‌: పాకిస్థాన్‌ సైనికులకు అమెరికాలో శిక్షణనిచ్చే కార్యక్రమాన్ని పునరుద్ధరించేందుకు ట్రంప్‌ పాలక వర్గం ఆమోదం తెలిపింది. అయితే ఈ నిర్ణయం వల్ల పాక్‌కు పూర్తి స్థాయి రక్షణ సహకారంపై అమెరికా విధించిన రద్దుపై ఎలాంటి ప్రభావం ఉండదని విదేశాంగ శాఖ దక్షిణాసియా విభాగం అసిస్టెంట్‌ సెక్రటరీ అలైస్ జి వెల్స్‌ స్పష్టం చేశారు. అంతకుముందు విదేశాంగ మంత్రి మైక్ పాంపియో పాకిస్థాన్‌ ఆర్మీ ఛీప్‌ జనరల్‌ ఖమర్‌ జావెద్‌ బజ్వాతో ఫోన్‌లో మాట్లాడారు. ఇరాన్‌ టాప్ కమాండర్‌ ఖాసిం సులేమానీ మృతి తర్వాత ఈ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీసినట్లు సమాచారం. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమెరికా తాజా నిర్ణయం వెలువడడం గమనార్హం.

ఇంటర్నేషనల్‌ మిలిటరీ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌(ఐఎంఈటీ) ప్రోగ్రాం ద్వారా గతంలో పాకిస్థాన్‌ సైనికులు అమెరికా సంస్థల్లో శిక్షణ పొందేవారు. అయితే రష్యా రక్షణ స్థావరాల్లోనూ పాక్‌ సైన్యం శిక్షణ పొందేలా ఒప్పందం కుదరడంతో అమెరికా ఐఎంఈటీని రద్దు చేసింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని