గురుద్వారాపై దాడిని ఖండించిన ఇమ్రాన్‌
close
Updated : 05/01/2020 17:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గురుద్వారాపై దాడిని ఖండించిన ఇమ్రాన్‌

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లోని సిక్కుల పవిత్రస్థలం నన్‌కానా సాహెబ్‌ గురుద్వారా మూకదాడిపై ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఎట్టకేలకు స్పందించారు. దాడిని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలను ప్రభుత్వం ఏమాత్రం సహించబోదని ట్విటర్‌ వేదికగా ఆదివారం స్పష్టం చేశారు.  ఇది తమ అభిమతానికి పూర్తి వ్యతిరేకమని ఆయన పేర్కొన్నారు. గురుద్వారాకు ప్రభుత్వం నుంచి పూర్తి రక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. 

అయితే, గత శుక్రవారం గురుద్వారాపై దాడిని ఖండిస్తూ దేశ రాజధాని దిల్లీలో నిరసనలు వెల్లువెత్తాయి. పాకిస్థాన్‌లో సిక్కులకు రక్షణ కల్పించాలని వందలాది మంది నిరసనకారులు డిమాండ్‌ చేశారు. భారత్‌లో ఉన్న శిరోమణి గురుద్వారా ప్రభందక్‌ కమిటీ దాడికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని పాక్‌ ప్రభుత్వాన్ని కోరనున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా.. గురుద్వారాపై ఎలాంటి దాడి జరగలేదని పాకిస్థాన్‌ విదేశీ వ్యవహారాల కార్యాలయం పేర్కొంది. గురుద్వారాకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని ఇవన్నీ అసత్యవార్తలని కొట్టిపారేశింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని