పాక్‌లో మరోదారుణం.. సిక్కు యువకుడి హత్య
close
Published : 05/01/2020 18:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాక్‌లో మరోదారుణం.. సిక్కు యువకుడి హత్య

దిల్లీ: లాహోర్‌లోని చరిత్రాత్మక గురుద్వారా నన్‌కానా సాహిబ్‌పై చోటు చేసుకున్న మూకుమ్మడి దాడి ఘటన మరువక ముందే పాకిస్థాన్‌లో మరో దారుణంచోటుచేసుకుంది. 25 ఏళ్ల ఓ సిక్కు యువకుడిని గుర్తు తెలియని ఓ వ్యక్తి హతమార్చాడు. పెషావర్‌లో జరిగిన ఈ ఘటనను భారత్‌ ఖండించింది. మైనారిటీలే లక్ష్యంగా జరిగిన ఈ హత్య ఘటనలో నిందితుడిని గుర్తించి కఠిన శిక్ష విధించాలని డిమాండ్‌ చేసింది.

ఖైబర్‌ పఖ్తున్‌క్వాలోని షంగ్లా జిల్లాలో నివసించే రవీందర్‌ సింగ్‌ పెళ్లి షాపింగ్‌ కోసం పెషావర్‌ వచ్చాడు. ఇంతలో గుర్తు తెలియని ఓ వ్యక్తి అతడిని హత్య చేశాడని స్థానిక మీడియా పేర్కొంది. నన్‌కానా సాహిబ్‌ గురుద్వారాపై మూకుమ్మడి దాడి ఘటన జరిగిన రెండు రోజులకే  ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. దీనిపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. పెషావర్‌లో జరిగిన దాడి ఘటనలో నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేసింది. ఇతర దేశాలకు నీతులు చెప్పేముందు తమ దేశంలో మైనారిటీలపై జరుగుతున్న దాడుల గురించి చర్యలు తీసుకోవాలని ఘాటుగా వ్యాఖ్యానించింది. కేంద్రమంత్రి హర్‌సిమ్రత్‌ బాదల్‌ కౌర్‌  ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. పాక్‌లో మైనారిటీలైన సిక్కులు పీడనకు గురౌతున్నారనడానికి ఇదే నిదర్శనమన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రధాని మోదీ, పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ చర్యలు తీసుకోవాలని ట్విటర్‌ వేదికగా అభ్యర్థించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని