‘అంబులెన్సా.. అటు వెళ్లమని చెప్పండి’
close
Updated : 08/01/2020 20:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘అంబులెన్సా.. అటు వెళ్లమని చెప్పండి’

బెంగాల్‌ భాజపా నేత వివాదాస్పద వ్యాఖ్యలు

కోల్‌కతా: అంబులెన్స్‌కు దారివ్వడం మన బాధ్యత. అంబులెన్స్‌ వస్తుందంటే పోలీసులు వెంటనే ట్రాఫిక్‌ క్లియర్‌ చేస్తుంటారు. రాష్ట్రపతి లాంటి వారే ఆ వాహనానికి దారిచ్చిన ఘటనలు సైతం మనం విన్నాం. అంతెందుకు ఆందోళనలు చేస్తున్నా.. అంబులెన్స్‌ కన్పిస్తే నిరసనలు ఆపి మరి వాహనానికి దారిస్తుంటారు. కానీ ఇక్కడ ఓ నేత తన ర్యాలీలోకి అంబులెన్స్‌ వచ్చినందుకు అసహనం వ్యక్తం చేశారు. ఇటువైపు ఎందుకొచ్చారని అసహనం వ్యక్తం చేశారు. మరో దారి చూసుకోండి అంటూ ఉచిత సలహా కూడా ఇచ్చారు. ఇంతకీ ఆ నేత ఎవరు.. ఏం జరిగిందంటే..

పశ్చిమబెంగాల్‌ భాజపా అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ మంగళవారం నదియా జిల్లా కృష్ణనగర్‌లో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఘోష్‌ ప్రసంగిస్తుండగా ఓ అంబులెన్స్‌ అటువైపుగా వచ్చింది. అది చూసిన ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు. ‘ఇక్కడ సమావేశం జరుగుతుందని డ్రైవర్‌కు తెలుసు కదా.. అయినా ఎందుకు ఇటే వచ్చాడు. అంబులెన్స్‌కు దారివ్వడం కుదరదు. రోడ్డుపై చాలా మంది కూర్చుని ఉన్నారు. వారంతా గందరగోళానికి గురవుతారు. ర్యాలీకి ఆటంకం కలిగించకుండా మరో దారి నుంచి వెళ్లండి’ అని ఘోష్‌ అన్నారు. 

ఈ సందర్భంగా అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు గుప్పించారు. తృణమూల్‌ నేతలు కావాలనే అంబులెన్స్‌ను ఇటు పంపించారని, తన ర్యాలీకి ఆటంకం కలిగించాలనేదే వారి ఉద్దేశమని ఆరోపించారు. దీంతో చేసేదేం లేక అంబులెన్స్‌ మరో రోడ్డు నుంచి వెళ్లిపోయింది. దిలీప్‌ ఘోష్‌ మాట్లాడిన వీడియో స్థానిక మీడియా ఛానళ్లలో వైరల్‌గా మారింది. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని