మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది: నరవణే
close
Published : 10/01/2020 01:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది: నరవణే

శ్రీనగర్‌: భారత నూతన సైనికాధిపతి మనోజ్‌ ముకుంద్ నరవణే గురువారం ఉత్తరాది సరిహద్దుల్లో అత్యంత కీలక ప్రాంతమైన సియాచిన్‌ను సందర్శించారు. సియాచిన్‌ సెక్టార్‌లో విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందిని కలిసి వారితో మాట్లాడారని సైనిక ప్రతినిధి తెలిపారు. సైనిక ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతికూల వాతావరణంలోనూ అన్ని రకాల సవాళ్లను ఎదుర్కొంటూ విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని నరవణే ప్రశంసించారు. సియాచిన్‌లో ఉన్న సైనికులను చూసి దేశమంతా గర్విస్తోందని ఆయన ప్రశంసించారు. సియాచిన్‌ క్షేత్రంలో కమాండర్‌ నేతృత్వంలో భద్రతాదళాల అప్రమత్తత గురించి ఆయన వివరించారు. ఇకముందూ సైనికులు అంతే ఉత్సాహంతో విధులు నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా నరవణే దేశ రక్షణలో భాగంగా సియాచిన్‌ బేస్‌ క్యాంప్‌లో అమరులైన సైనికులకు నివాళులు అర్పించారు. పర్యటనలో నరవణే వెంట లెఫ్టినెంట్‌ జనరల్‌ వైకే జోషి ఉన్నారు. మనోజ్‌ ముకుంద్‌ నరవణే జనవరి 1న భారత సైనికాధిపతిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని