మంచులో జారి... పాకిస్థాన్‌లో పడిపోయి...
close
Published : 13/01/2020 20:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మంచులో జారి... పాకిస్థాన్‌లో పడిపోయి...

బారాముల్లా (జమ్ము-కశ్మీర్‌): పొరపాటున మంచులో పడిపోయిన భారత సైనికోద్యోగి ఒకరు జారుతూ పోయి పాకిస్థాన్‌ భూభాగంలో పడిపోయారు. వివరాలు ఇలా ఉన్నాయి... డెహ్రాడూన్‌లోని అంబీవాలా సైనిక కాలనీకి చెందిన రాజేంద్ర సింగ్‌ నేగి 2002లో భారత సైన్యంలో చేరారు. ఇటీవల ఆయనను కశ్మీరులోని శీతల ప్రాంతమైన గుల్మార్గ్‌కు బదిలీ చేశారు. కాగా జనవరి 8న నేగి భార్య రాజేశ్వరికి ఆయన కనపడటం లేదంటూ భారత సైన్యం నుంచి సమాచారం వచ్చింది. ప్రమాదవశాత్తూ మంచులో జారిపడిన ఆయన భారత సరిహద్దును దాటి పాక్‌వైపు భూభాగంలోకి ప్రవేశించినట్టు అధికారులు తెలిపారు. దీనితో ఆందోళనకు గురైన రాజేంద్ర సింగ్‌ నేగి కుటుంబసభ్యులు ఆయనను స్వదేశానికి తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలను చేపట్టవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాగా హవల్దార్‌ నేగిని వెతికి, రక్షించే కార్యక్రమం చేపట్టామని సైనికాధికారులు తెలిపారు. ఆయనను  క్షేమంగా తిరిగి తీసుకురావటానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని వారు హామీ ఇచ్చారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని