ఉగ్రవాదం అంతానికి రావత్‌ చెప్పిన మార్గం..!
close
Published : 17/01/2020 00:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉగ్రవాదం అంతానికి రావత్‌ చెప్పిన మార్గం..!

దిల్లీ: ఉగ్రవాదానికి మద్దతిస్తున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని త్రిదళాధిపతి(సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ అన్నారు. ఉగ్రవాదాన్ని రూపుమాపాలంటే.. 9/11 ఉగ్రదాడుల తర్వాత అమెరికా వ్యవహరిస్తున్న తరహాలో కఠిన విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దిల్లీలో జరుగుతున్న ‘రైజీనా డైలాగ్‌’ సదస్సులో మాట్లాడుతూ గురువారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో ప్రపంచ వాణిజ్య కేంద్రంపై అల్‌ఖైదా దాడి తర్వాత అగ్రరాజ్య సైనిక బలగాలు అఫ్గానిస్థాన్‌లో పాగా వేశాయి. తాలిబన్లపై తిరుగులేని పోరాటం చేశారు. ఎట్టకేలకు దాడుల సూత్రధారి, తాలిబన్‌ అధినేత ఒసామా బిన్‌ లాడెన్‌ను పాక్‌లో వెతికి పట్టుకొని 2011లో తుదముట్టించారు.

ముష్కర ముఠాలకు మద్దతిస్తున్న దేశాలను ఉగ్రవాదంపై జరుపుతున్న పోరులో చేర్చకూదని రావత్‌ అభిప్రాయపడ్డారు. అటువంటి దేశాల్ని ‘దౌత్యపరంగా ఏకాకి’ని చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఆ దిశగా అడుగు ముందుకేస్తూ ఆర్థిక చర్యల కార్యదళం(ఎఫ్‌ఏటీఎఫ్‌) ఆంక్షలు విధించడం సముచితమైన నిర్ణయమన్నారు. ఉగ్రముఠాలకు ఆయుధాలు, నిధులతో పాటు ఇతర సహాయ సహకారాలు అందించే దేశాలు ఉన్నంత వరకు ఉగ్రవాదంపై జరుగుతున్న పోరుకు ముగింపు పలకలేమన్నారు. పరోక్షంగా పాకిస్థాన్‌కు చురకలంటించారు. కశ్మీర్‌లో యువత ఉగ్రవాదంవైపు ఆకర్షితులవుతుండడం పట్ల ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని నిలువరించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని