‘పౌరచట్టం’పై మొన్న కేరళ.. నేడు పంజాబ్‌
close
Updated : 17/01/2020 16:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘పౌరచట్టం’పై మొన్న కేరళ.. నేడు పంజాబ్‌

చండీగఢ్‌: పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కేరళ ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించగా.. తాజాగా పంజాబ్‌ ప్రభుత్వం కూడా అదే నిర్ణయం తీసుకుంది. సీఏఏను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ అధికార కాంగ్రెస్‌ తీసుకొచ్చిన తీర్మానానికి పంజాబ్‌ అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. 

రాష్ట్ర మంత్రి బ్రహ్మ మోహింద్రా ఈ తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టారు. ‘సీఏఏ వల్ల దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. పంజాబ్‌లోనూ నిరసనలు చోటుచేసుకున్నాయి. అందుకే ఈ చట్ట సవరణను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం’ అని తీర్మానం సందర్భంగా మోహింద్రా పేర్కొన్నారు. 

గత నెలలో కేరళ ప్రభుత్వం కూడా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన తీర్మానాన్ని ఆమోదించిన విషయం తెలిసిందే. శాసనసభలో ఈ తీర్మానాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రవేశపెట్టగా.. ఒక్క భాజపా ఏకైక ఎమ్మెల్యే మినహా మిగతా సభ్యులంతా ఆమోదముద్ర వేశారు. మరోవైపు ఈ చట్టాన్ని సవాల్‌ చేస్తూ కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. సీఏఏకు వ్యతిరేకంగా సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ వేసిన తొలి రాష్ట్రం కేరళనే. 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని