అరెస్టు చేయలేనంత ‘అతిపే..ద్ద’ ఉగ్రవాది
close
Published : 19/01/2020 12:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అరెస్టు చేయలేనంత ‘అతిపే..ద్ద’ ఉగ్రవాది

మోసుల్‌: ఉగ్రసంస్థ ఐసిస్‌కు చెందిన ‘అతిపే..ద్ద ఉగ్రవాదిని ఇరాక్‌ బలగాలు అరెస్టు చేశాయి. ఇక్కడ అతిపెద్ద అంటే ఆ సంస్థలో కీలక స్థానంలో ఉన్న వ్యక్తి కాదండోయ్‌! ఇక్కడ పెద్ద అంటే స్థూలకాయుడు అని. 560 పౌండ్లు (సుమారు 250కిలోలు) ఉన్న ఓ ఐసిస్‌ ఉగ్రవాది ఓ ఇంట్లో తలదాచుకున్నాడన్న సమాచారంతో ఇరాక్‌ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కానీ, అతని ఆకారాన్ని చూసి వారు ఆశ్చర్యపోయారు. కారులో ఎక్కించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఇక చేసేది లేక ఓ పికప్‌ ట్రక్కును తీసుకొచ్చి జైలుకు తరలించారు. అక్కడి పోలీసుల వివరాల ప్రకారం.. ముఫ్తీ అబు అబ్దుల్‌ బారీ అనే ఐసిస్ ముష్కరుడు.. విద్వేష ప్రసంగాలు ఇవ్వడంలో దిట్ట. యువతను ఐసిస్‌ సానుభూతిపరులుగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఐసిస్‌లో చేరి తదనంతర కాలంలో వ్యతిరేకంగా మారిన వారిని చంపేయాలని అబు ‘ఫత్వా’లు కూడా జారీ చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. సామాజిక మాధ్యమాల్లో ఇతడిని ‘జబ్బా ది జిహాదీ’గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని