‘2838 మంది పాకిస్థానీలకు భారత పౌరసత్వం’
close
Updated : 19/01/2020 20:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘2838 మంది పాకిస్థానీలకు భారత పౌరసత్వం’

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌

చెన్నై: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న వేళ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కీలక విషయాలు వెల్లడించారు. గత ఆరేళ్లలో 2838 మంది పాకిస్థానీ శరణార్థులకు భారత పౌరసత్వం కల్పించినట్లు ప్రకటించారు. అలాగే 914 మంది అఫ్గాన్లకు, 172 మంది బంగ్గాదేశీయులకు భారత పౌరసత్వ హోదా కల్పించామన్నారు. వీరిలో ముస్లింలు కూడా ఉన్నారన్నారు. 1964 నుంచి 2008 మధ్య శ్రీలంక నుంచి వలస వచ్చిన నాలుగు లక్షల మంది తమిళులకు భారత పౌరసత్వం కల్పించారని తెలిపారు. సీఏఏపై చెన్నైలో ఆదివారం జరిగిన అవగాహనా సదస్సులో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 2014 వరకు 566 మంది పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌కు చెందిన ముస్లింలకు పౌరసత్వం కల్పిస్తే.. మోదీ హయాంలో 2016-2018 మధ్య 1595 మంది పాకిస్థాన్‌, 391 మంది అఫ్గానిస్థాన్ ముస్లింలకు భారత పౌరసత్వ హోదా కల్పించామని తెలిపారు. ఈ సమయంలోనే ప్రముఖ గాయకుడు అద్నాన్‌ సమీకి కూడా ఇచ్చామని గుర్తుచేశారు. 

విదేశాల్లో మతపరమైన హింసకు గురవుతున్న  వారికి పౌరసత్వం కల్పించే ఉద్దేశంతోనే సీఏఏని తీసుకువచ్చామని.. ఎవరి పౌరసత్వం రద్దు చేయడం దీని ఉద్దేశం కాదని వివరించారు. అలాగే సీఏఏని అమలు చేయబోమని ప్రకటించిన రాష్ట్రాలకు ఆమె చురకలంటించారు. పార్లమెంటు ఆమోదం పొందిన చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలపై ఉందన్నారు. లేనిపక్షంలో అది రాజ్యాంగవిరుద్ధ చర్య అవుతుందని స్పష్టం చేశారు.  
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని