కిక్కిరిసిపోయిన సుప్రీం.. సీజేఐ ఆగ్రహం
close
Published : 22/01/2020 11:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కిక్కిరిసిపోయిన సుప్రీం.. సీజేఐ ఆగ్రహం

దిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన 140కి పైగా పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు విచారణ ప్రారంభించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్లపై వాదనలు వింటోంది. కాగా.. విచారణ నిమిత్తం 143 పిటిషన్లకు సంబంధించిన వ్యాజ్యదారులు, వారి తరఫు న్యాయవాదులు న్యాయస్థానానికి వచ్చారు. దీంతో సుప్రీంకోర్టు కిక్కిరిసిపోయింది. 

కోర్టు గదిలోకి వచ్చేందుకు న్యాయవాదులు, వ్యాజ్యదారులు తోసుకుంటుండటం చూసి సీజేఐ బోబ్డే అసహనం వ్యక్తం చేశారు. సమూహాన్ని కంట్రోల్‌ చేయాలంటూ సుప్రీంకోర్టు భద్రతా సిబ్బందిని ఆదేశించారు. 

అనంతరం పిటిషన్లపై ధర్మాసనం విచారణ ప్రారంభించింది. పౌరసత్వ చట్టంపై కేంద్రం ప్రాథమిక అఫిడవిట్‌ను సిద్ధం చేసిందని, దాన్ని పార్టీలకు అందజేస్తామని అటార్నీ జనరల్‌ కోర్టుకు తెలిపారు. అదే సమయంలో సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదిస్తూ సీఏఏపై పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాలని కోరారు. దీనికి సీజేఐ స్పందిస్తూ.. అవసరమైతే అలాగే చేస్తామన్నారు. ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. 
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని