జమ్మూకశ్మీర్‌ చిన్నారులు దేశభక్తులు: రాజ్‌నాథ్‌
close
Published : 23/01/2020 01:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జమ్మూకశ్మీర్‌ చిన్నారులు దేశభక్తులు: రాజ్‌నాథ్‌

దిల్లీ: జమ్మూకశ్మీర్‌లో నివసించే చిన్నారులు దేశభక్తులని, కొందరు వారిని తప్పుదోవ పట్టిస్తున్నారని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. 10, 12 ఏళ్లున్నప్పుడే కశ్మీర్‌లోని చిన్నారులను అతివాదులుగా మారుస్తున్నారని ఇటీవల సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. దిల్లీలోని ఎన్‌సీసీ రిపబ్లిక్‌ క్యాంప్‌ను సందర్శించిన సందర్భంగా ఆయన బుధవారం మాట్లాడారు. జమ్మూకశ్మీర్‌ చిన్నారులు దేశభక్తులన్నారు. ఇక్కడి యువతను కొందరు తప్పుడు మార్గంవైపు ప్రేరేపించడం వల్ల వారు తప్పుదోవ పడుతున్నారని అన్నారు. అలా ప్రేరేపిస్తున్న వారు అసలైన దోషులని, వారిని తప్పుపట్టాలని అన్నారు.

అమెరికా, పాక్‌ మతపరమైన రాజ్యాలే..

అన్ని మతాలూ సమానమేనని భారత్‌ భావిస్తుందని రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. అందుకే మన దేశం లౌకికదేశంగా ఉందని, పాకిస్థాన్‌లా మతపరమైన పాలనా రాజ్యంలా అవతరలించలేదన్నారు. ‘‘మన దేశంలో ఏ మతంపైనా వివక్ష చూపడం లేదు. మన పొరుగున ఉన్న దేశం మాత్రం మతపరమైన రాజ్యంగా ప్రకటించుకుంది. మనం అలా ప్రకటించుకోలేదు. ఇవాళ అమెరికా కూడా ఒక మతపరమైన పాలనా రాజ్యామే. కానీ భారత్‌ అలా కాదు. ఈ ప్రపంచంలో ఉన్న వారంతా ఒక కుటుంబం అని మన రుషులు, యోగులు చెప్పారు. ఈ ప్రపంచాన్ని ‘వసుధైక కుటంబం’గా పిలిచారు’’ అని రాజ్‌నాథ్‌ అన్నారు. భారత్‌ లౌకిక రాజ్యమని, ఇక్కడ ఎవరైనా నివసించొచ్చని రాజ్‌నాథ్‌ అన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని