మోదీజీ.. ఆ సాధ్వి పరిస్థితి చూడండి!
close
Published : 24/01/2020 01:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మోదీజీ.. ఆ సాధ్వి పరిస్థితి చూడండి!

ప్రధానికి బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ లేఖ

దిల్లీ: గంగానది ప్రక్షాళన కోసం గత డిసెంబర్‌ 15 నుంచి నిరాహార దీక్ష చేస్తున్న సాధ్వి పద్మావతి ఆరోగ్య పరిస్థితి గురించి ఆలోచించాలని బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ ప్రధాని మోదీని కోరారు. ఈ మేరకు ఆయనకు లేఖ రాశారు. పద్మావతి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణించిపోతోందని నితీశ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. పద్మావతి డిమాండ్ల పరిష్కారం దిశగా ప్రధాని చొరవచూపాలని, ఆమె నిరాహార దీక్ష విరమించేలా చూడాలని తన లేఖలో పేర్కొన్నారు. గంగానదిని ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తూ బిహార్‌లోని నలంద ప్రాంతానికి చెందిన పద్మావతి అనే సాధ్వి హరిద్వార్‌లో నిరాహార దీక్షకు దిగిన విషయం తెలిసిందే.

నేషనల్‌ గంగా కౌన్సిల్‌ సభ్యులతో గత నెలలో ప్రధాని మోదీ తొలిసారిగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంగా నది ప్రక్షాళన భారత సహకార సమాఖ్య విధానానికి నిదర్శనమని అన్నారు. అధికారులు తెలిపిన వివరాల మేరకు 2015-20 మధ్య కాలంలో గంగానది పరిధిలోని 5 రాష్ట్రాలకు రూ.20,000కోట్లు కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మొత్తంతో ఆయా రాష్ట్రాల్లో గంగ ప్రక్షాళన చేయాలని సూచించింది. అయితే ఈ కార్యక్రమం అనుకున్నంత స్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదు.
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని