భారత్‌కు అక్రమ వలసదారులు పెరిగారు
close
Published : 25/01/2020 00:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌కు అక్రమ వలసదారులు పెరిగారు

కోల్‌కతా: ఇటీవల కాలంలో బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌లోకి ప్రవేశించే అక్రమ వలసదారుల సంఖ్య పెరిగిందని సరిహద్దు భద్రతాదళం (బీఎస్‌ఎఫ్‌) వెల్లడించింది. భారత్‌ అమలు చేసిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కూడా దీనికి ఓ కారణం కావొచ్చని అభిప్రాయపడింది. ఈ మేరకు బీఎస్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ వైబి ఖురానీ మీడియాకు తెలిపారు. ఒక్క జనవరి నెలలోనే ఇప్పటి వరకూ 268 మందిని పట్టుకున్నామని, వారిలో చాలామంది అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన వారేనని ఆయన వివరించారు.

భారత్‌కు పొరుగు దేశాలైన అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ల నుంచి మతపరమైన దాడులు, హింస కారణంగా వేరే మార్గాల్లో వచ్చిన హిందూ, సిక్కు, జైన్‌, బౌద్ధ, పార్శీ, క్రైస్తవులకు భారతీయ పౌరసత్వం కల్పిస్తూ భారత ప్రభుత్వం సీఏఏను అమల్లోకి తీసుకొచ్చింది. ఇంతకు ముందు వరకు ఎవరైనా అక్రమంగా భారత్‌కు వస్తే.. వారిని చట్టవ్యతిరేక కాందిశీకులుగా ముద్ర వేసేవారు. ఎలాంటి పత్రాలు లేకుండా భారత్‌కు వచ్చి నిర్ధారిత సమయానికి మించి ఇక్కడే తలదాచుకున్న వారందర్నీ అక్రమ వలసదార్లు (ఇల్లీగల్‌ ఇమిగ్రెంట్‌)గానే గుర్తించేవారు. ఇప్పుడు అలాంటి వారందరికీ భారతీయ పౌరసత్వం ఇస్తున్నారు. అయితే ముస్లింలను ఇందులో విస్మరించడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని