మేం మధ్యవర్తిత్వం చేస్తాం: నేపాల్‌
close
Published : 26/01/2020 01:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

 మేం మధ్యవర్తిత్వం చేస్తాం: నేపాల్‌

కాఠ్‌మాండూ: భారత్‌-పాక్‌ మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైతే మధ్యవర్తిత్వం చేస్తామని నేపాల్‌ సంసిద్ధత వ్యక్తంచేసింది. ఆ రెండు దేశాల మధ్య నెలకొన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఆ దేశం పేర్కొంది. ‘ఏ సమస్యనైనా పరిష్కరించేందుకు చర్చలే సరైన మార్గం. వాళ్ల మధ్య విభేదాలు ఉంచొచ్చు కానీ వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. అవసరమైతే.. మేం మధ్యవర్తిత్వం వ్యవహరించేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని నేపాల్‌ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇరు దేశాలు చర్చలకు కూర్చుంటే సమస్యలు పరిష్కారమవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేసింది. 
సార్క్‌ (ఎస్‌ఏఏఆర్‌సీ) ఉగ్రవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుందని నేపాల్‌ వర్గాలు తెలిపాయి. 2014లో చివరి సారిగా కాఠ్‌మాండూలో సార్క్‌ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు. అనంతరం 2016లో సార్క్‌ సదస్సును ఇస్లామాబాద్‌లో ఏర్పాటు చేయగా భారత్‌ వెళ్లేందుకు నిరాకరించింది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని