చైనా టు భారత్‌.. అదో సవాల్‌!
close
Published : 02/02/2020 01:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చైనా టు భారత్‌.. అదో సవాల్‌!

ఎయిర్‌ ఇండియా డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) కెప్టెన్‌ అమితాబ్ సింగ్‌

దిల్లీ: కరోనా వైరస్‌ గుప్పిట్లో ఉన్న చైనా నుంచి భారతీయులను వెనక్కి తీసుకురావడం ఒక సవాల్‌తో కూడిన వ్యవహారమని ఎయిర్‌ ఇండియా డైరెక్టర్ (ఆపరేషన్స్‌) కెప్టెన్‌ అమితాబ్‌ సింగ్‌ అన్నారు. కెప్టెన్‌ అమితాబ్‌ సింగ్‌ నేతృత్వంలోని 20 మంది ఎయిర్‌ ఇండియా బృందంతో కూడిన ప్రత్యేక విమానంలో చైనాలోని వుహాన్‌ నుంచి 324 మంది భారతీయులు ఈరోజు భారత్‌కు చేరుకున్నారు. వారిని అక్కడనుంచి తీసుకురావడానికి అక్కడ నెలకొన్న పరిస్థితులు, ఎదుర్కొన్న సవాళ్లపై అమితాబ్‌ సింగ్‌ స్పందించారు.

‘భారతీయ విద్యార్థులను విశ్వవిద్యాలయాల నుంచి నేరుగా కాన్సుల్‌ కార్యాలయానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి వారిని ఎయిర్‌పోర్టుకు తరలించారు. ఎయిర్‌ ఇండియా ప్రత్యేక విమానం వుహాన్‌ చేరుకునేలోగా వారు అక్కడ సిద్ధంగా ఉన్నారు. ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాలు, సిటీలోని మరే ఇతర ప్రాంతాల్లో వీరు సంచరించకూడదంటూ అక్కడి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. భారతీయులను విమానంలోకి ఎక్కించే ముందు ఇమిగ్రేషన్‌ ప్రక్రియ, కరోనా నేపథ్యంలో మెడికల్‌ స్క్రీనింగ్‌, ఇతర వైద్య పరీక్షలు పూర్తయ్యేసరికి దాదాపు 7 గంటల సమయం పట్టింది. కరోనా వైరస్‌ మొదలైన చైనాకు వెళ్లి అక్కడ నుంచి భారతీయులను తీసుకురావడం మాకు ఒక సవాల్‌లా అనిపించింది’ అని కెప్టెన్‌ అమితాబ్‌ సింగ్‌ అన్నారు.

‘భారతీయులను తీసుకొచ్చేందుకు వెళ్లిన 20 మంది ఎయిర్‌ ఇండియా బృందానికి ఎలాంటి వైరస్‌ సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఆర్‌ఎంఎల్‌ నుంచి అనుభవజ్ఞులైన వైద్యులను మాతో చైనాకు తీసుకెళ్లాం. మేం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైద్యులు మాకు సూచించారు. దీంతో మేం మా భయాన్ని పక్కనపెట్టాం’ అని సింగ్‌ పేర్కొన్నారు. 324 మంది భారతీయులను భారత్‌కు తీసుకొచ్చిన కెప్టెన్‌ అమితాబ్‌ సింగ్‌ త్వరలోనే మరికొంత మంది భారతీయులను తీసుకొచ్చేందుకు మరోసారి వుహాన్‌ వెళ్లనున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని