పాటకు ఫిదా... గాయనిపై నోట్ల వరద
close
Published : 04/02/2020 00:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాటకు ఫిదా... గాయనిపై నోట్ల వరద

అహ్మదాబాద్: ఏదైనా సంగీత విభావరి లేదా సాంస్కృతిక కార్యక్రమం జరిగినప్పుడు అందులో పాల్గొన్న గాయనీ గాయకులపై అభిమానంతో  సన్మానం చేయడం సర్వసాధారణం. కానీ గుజరాత్‌లో జరిగిన ఓ సంగీత కార్యక్రమంలో పాట పాడుతున్న జానపద గాయనిపై అక్కడి ప్రజలు నోట్ల వర్షం కురిపించారు. గుజరాత్‌లోని నవసారి జిల్లా చిట్లీ తాలుకా వన్జనా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకొంది. భజన్‌ సంధ్య పేరుతో ఆధ్యాత్మిక పాటలతో స్థానికంగా ఉండే ఓ ట్రస్ట్‌ జానపద గాయని గీతా రబారీ సంగీత విభావరి ఏర్పాటు చేసింది.ఈ కార్యక్రమంలో ఆమె పాటకు ముగ్ధులైన జనం గీతా రబారీపై నోట్ల వర్షం కురిపించారు. ఆమెపై కురిసిన ఈ నోట్ల విలువ లక్షల్లో ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. పది రూపాయల నోట్ల నుంచి రెండు వేల రూపాయల నోట్లు ఆమెపై వెదజల్లారు. అలా కురిసిన నోట్లలో అమెరికన్‌ డాలర్లు కూడా ఉండటం గమనార్హం. కార్యక్రమం ముగిసిన తర్వాత నోట్లను లెక్కిస్తే రూ.8 లక్షలు వరకు ఉన్నట్లు తేలింది. అయితే ఈ మొత్తాన్ని పిల్లల చదువు, ఉచిత ఆహార కేంద్రాన్ని నడిపించటం సహా గిరిజన యువతులకు వివాహం జరిపించేందుకు ఉపయోగిస్తామని నిర్వాహకులు తెలిపారు. నిధుల సేకరణ కోసం ఈ తరహాలో కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు.   

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని