నిర్భయ దోషుల ఉరి అమలు స్టేపై నేడు తీర్పు
close
Updated : 05/02/2020 08:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిర్భయ దోషుల ఉరి అమలు స్టేపై నేడు తీర్పు

దిల్లీ: నిర్భయ అత్యాచార, హత్య కేసులో దోషులకు ఉరిశిక్ష అమలు చేయకుండా దిల్లీ పటియాలా హౌస్‌ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై దిల్లీ హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది. కేంద్రం పిటిషన్‌పై శనివారం, ఆదివారం ప్రత్యేకంగా విచారణ జరిపిన దిల్లీ హైకోర్టు ఈ నెల 2న తీర్పును రిజర్వ్‌ చేసింది. దోషుల క్షమాభిక్ష, క్యురేటివ్‌ పిటిషన్లు వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ఉరిశిక్ష అమలుపై పటియాలా హౌస్‌ కోర్టు జనవరి 31న స్టే విధించింది. ఈ స్టేను సవాల్‌ చేస్తూ కేంద్రం, దిల్లీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించాయి.

ఫిబ్రవరి 1న నలుగురు దోషులను ఉరితీయాల్సిందిగా దిల్లీ కోర్టు రెండోసారి డెత్‌ వారెంట్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. కానీ దోషులు తమకు విధించిన ఉరిశిక్షపై స్టే విధించాల్సిందిగా కోరుతూ మరణశిక్షకు రెండు రోజుల ముందు న్యాయస్థానంలో పిటిషన్‌ వేశారు. దీంతో ఉరి అమలు రెండోసారి వాయిదా పడింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఉరి అమలును వాయిదా వేస్తున్నట్లు దిల్లీ కోర్టు తీర్పు వెలువరించింది. దీన్ని సవాల్‌ చేస్తూ కేంద్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన దిల్లీ కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది.  
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని