అక్షయ్‌ క్షమాభిక్ష పిటిషన్‌ తిరస్కరణ
close
Updated : 05/02/2020 21:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అక్షయ్‌ క్షమాభిక్ష పిటిషన్‌ తిరస్కరణ

దిల్లీ: నిర్భయ దోషుల్లో ఒకరైన అక్షయ్‌ కుమార్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బుధవారం తిరస్కరించారు. గత శనివారం మరో దోషి వినయ్‌ శర్మ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించిన గంటల వ్యవధిలోనే అక్షయ్‌ కూడా క్షమాభిక్ష ప్రసాదించాలని పిటిషన్‌ దాఖలు చేశాడు. దీంతో వారికి ఫిబ్రవరి 1న విధించాల్సిన ఉరిశిక్ష అమలును దిల్లీ న్యాయస్థానం నిలిపివేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఉరి అమలుపై స్టే విధించింది.

దీంతో ప్రత్యేక కోర్టు స్టే విధించడాన్ని సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం దిల్లీ హైకోర్టులో మరో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన దిల్లీ హైకోర్టు నలుగురు దోషుల్ని వేర్వేరుగా ఉరితీయడం కుదరదని తేల్చి చెబుతూ పిటిషన్‌ను ఇవాళ కొట్టి వేసింది. అయితే దోషులు వారంలోగా తమకున్న న్యాయ పరమైన అవకాశాల్ని వినియోగించుకోవాలంటూ స్పష్టంచేసింది. దీంతో కేంద్రం దిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని