ఏకే 47తో కాల్చినా ఆ హెల్మెట్‌ రక్షిస్తుంది!
close
Published : 09/02/2020 01:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏకే 47తో కాల్చినా ఆ హెల్మెట్‌ రక్షిస్తుంది!

లఖ్‌నవూ: భారత సైన్యానికి చెందిన ఓ మేజర్‌ విధుల్లోని సైనికులకు ఉపయోగపడేలా బాలిస్టిక్‌ బుల్లెట్‌ప్రూఫ్‌ హెల్మెట్‌ను రూపొందించారు. గతంలో బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ తయారు చేసిన మేజర్‌ అనూప్‌మిశ్రానే.. ప్రస్తుతం హెల్మెట్‌ను కూడా అభివృద్ధి చేయడం విశేషం. ఈ హెల్మెట్‌కు ఏకే 47తో 10 మీటర్ల దూరం నుంచి కాల్పులు జరిపినా తట్టుకోగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అబేధ్య ప్రాజెక్టులో భాగంగా మిశ్రా ఈ బాలిస్టిక్ హెల్మెట్‌ను రూపొందించారు. గతంలో ఆయన తయారుచేసిన బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్‌ స్నైపర్‌ రైఫిల్స్‌ను కూడా తట్టుకోగలదు. ఇండియన్‌ ఆర్మీ కళాశాలకు చెందిన ఈ అధికారి.. తన పాత కాలం నాటి బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్‌కు తుపాకీ కాల్పుల ప్రభావం పడటంతో మరో ప్రత్యామ్నాయ జాకెట్‌ తయారుచేయాలని భావించి దాన్ని రూపొందించారు. అదేవిధంగా ఈ కళాశాల ఓ ప్రైవేటు సంస్థతో కలిసి ప్రపంచంలోనే అతితక్కువ ధరలో గన్‌షాట్‌ లొకేటర్‌ను కూడా తయారు చేసింది. పుణెలో ఉన్న ఈ మిలిటరీ ఇంజనీరింగ్‌ కళాశాల(సీఎంఈ).. కార్ప్స్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌కు జీఐఎస్‌ విషయాలతో పాటు.. సీబీఆర్‌ఎన్‌ రక్షణ సహా పలు అంశాలపై శిక్షణ ఇవ్వడం వంటి బాధ్యతలు నిర్వహిస్తుంది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని