భాజపా జాతీయవాదానికి తెలివిగా చెక్‌..
close
Published : 11/02/2020 19:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భాజపా జాతీయవాదానికి తెలివిగా చెక్‌..

దిల్లీ: భాజపా జాతీయవాదానికి దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో  కేజ్రీవాల్‌ తెలివిగా చెక్‌పెట్టారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో బాలాకోట్‌పై ప్రతిపక్షాలు వ్యాఖ్యానిస్తే.. పాక్‌ భాష మాట్లాడుతున్నాయంటూ ప్రధాని మోదీ విమర్శించారు. ఇవి ప్రజలపై బలంగానే పనిచేశాయి. ఆ ప్రభావం ప్రతిపక్షాల సీట్లపై పడింది. ఈ సారి దిల్లీ ఎన్నికల సమయంలో పాక్‌ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కానీ, కేజ్రీవాల్‌ లౌక్యంగా తప్పించుకొని పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకొన్నారు.    

పాక్‌ మంత్రి ఫవాద్‌ చౌదురి దిల్లీ ఎన్నికల్లో ఆప్‌ గెలవాలంటూ ట్వీట్‌ పెట్టారు. భాజపా దీనిని ఆయుధంగా చేసుకొని జాతీయ వాదాన్ని ఎన్నికల ప్రచారంలోకి చొప్పించే ప్రయత్నం చేసింది. దీనిలో భాజపా సఫలమైతే జరిగే నష్టమేమిటో సార్వత్రిక ఎన్నికల్లో కేజ్రీవాల్‌ రుచి చూశారు. అందుకే ఆయన కొంచెం తెలివిగా వ్యవహరించి ఫవాద్‌ చౌదురికి ఘాటుగా సమాధానం ఇచ్చారు.  ‘మోదీ భారతావనికి ప్రధానమంత్రి, నాకూ ఆయనే ప్రధాని. దిల్లీ ఎన్నికలు పూర్తిగా భారత అంతర్గత వ్యవహారం. ఉగ్రవాదాన్ని పెద్దయెత్తున పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌ మా దేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు’ అంటూ సమాధానమిచ్చారు. ఈ  ప్రతిస్పందనకు భాజపా సానుభూతిపరులు కూడా ముగ్ధులైపోయారు. రాజకీయంగా ఆయన చూపిన పరిణతి ఓట్లు చేజారి పోకుండా చేసింది. అదే సమయంలో సీఏఏపై, షాహీన్‌ బాగ్‌లో  జరుగుతున్న ఆందోళనలకు దూరంగా ఉండటం కూడా కలసివచ్చింది.

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని