హఫీజ్‌ సయీద్‌ అరెస్టును స్వాగతించిన అమెరికా
close
Published : 13/02/2020 10:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హఫీజ్‌ సయీద్‌ అరెస్టును స్వాగతించిన అమెరికా

వాషింగ్టన్‌: కరడుగట్టిన ఉగ్రవాది, ముంబయి పేలుళ్ల సూత్రధారి హఫిజ్‌ సయీద్‌కు జైలుశిక్ష విధించడాన్ని అగ్రరాజ్యం అమెరికా స్వాగతించింది. లష్కరే తోయిబా నేరాలను నిరూపించడంలో ఇది ముందడుగని వ్యాఖ్యానించింది. అలాగే ఉగ్రవాదులకు నిధుల కట్టడి కోసం ఆర్థిక చర్యల కార్యదళం(ఎఫ్‌ఏటీఎఫ్‌) నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునే దిశగానూ ఇది ఉపయోగపడుతుందని అభిప్రాయపడింది. ఈ మేరకు అమెరికా విదేశాంగశాఖలోని ఉన్నతాధికారి అలైస్‌ జి వెల్స్‌ ట్వీట్‌ చేశారు. ముంబయి పేలుళ్లలో ప్రధాన నిందితుడైన సయీద్‌పై చర్యలు తీసుకోవాలని భారత్‌, అమెరికాలు ఎంతో కాలం నుంచి పాక్‌ను డిమాండ్‌ చేస్తున్నాయి.

ఉగ్రవాదానికి నిధులు చేరవేస్తున్నారన్న నేరాల కింద సయీద్‌కు పాకిస్థాన్‌ కోర్టు బుధవారం 11 ఏళ్ల జైలుశిక్ష విధించింది. సయీద్‌, అతనికి సన్నిహితుడైన జాఫర్‌ ఇక్బాల్‌లకు 2 కేసుల్లో ఈ శిక్ష పడింది. ‘గ్రే జాబితా’ నుంచి పాకిస్థాన్‌ను తొలిగించాలా.. వద్దా.. అన్న అంశంపై ఎఫ్‌ఏటీఎఫ్‌ మరో నాలుగు రోజుల్లో నిర్ణయం తీసుకోనుంది. ఈ నేపథ్యంలో సయీద్‌కు శిక్ష విధించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చదవండి: 

హఫిజ్‌ సయీద్‌కు పాక్‌లో జైలుశిక్షమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని