మసూద్‌ పారిపోలేదు.. భద్రంగా దాచిపెట్టారు
close
Updated : 18/02/2020 15:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మసూద్‌ పారిపోలేదు.. భద్రంగా దాచిపెట్టారు

భారత నిఘా వర్గాల సమాచారం

దిల్లీ: దాయాది దేశం పాకిస్థాన్‌ చెబుతున్నట్లుగా మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది, జైషే మహ్మద్‌ అధినేత మౌలానా మసూద్‌ అజార్‌ నిజంగానే కన్పించకుండా పోయాడా..? అంటే కానే కాదంటున్నాయి భారత నిఘా సంస్థలు. పాకిస్థాన్ ఆర్మీ‌, ఐఎస్‌ఐ స్వయంగా అజార్‌ను అత్యంత భద్రమైన ప్రదేశంలో దాచిపెట్టాయని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. పాకిస్థాన్‌లోని బహవల్‌పూర్‌లో ఓ బుల్లెట్‌ ఫ్రూఫ్‌ ఇంట్లో అజార్‌ సురక్షితంగా దాక్కొన్నాడట. 

ఉగ్రవాద నిర్మూలనకు ఎలాంటి చర్యలు చేపట్టని పాకిస్థాన్‌ను బ్లాక్‌ లిస్ట్‌లో చేర్చాలా వద్దా అన్న అంశంపై ఆర్థిక చర్యల కార్యదళం(ఎఫ్‌ఏటీఎఫ్‌) ఈ వారంలో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ నేపథ్యంలో కంటితుడుపు చర్యలకు దిగిన పాక్‌.. ఇటీవల లష్కరే తోయిబా ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌కు రెండు కేసుల్లో 11ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇదే సమయంలో జైషే అగ్రనేత మసూద్‌ అజార్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు సరికదా.. అతడు కొంత కాలం నుంచి కన్పించట్లేదంటూ తాజాగా ప్రకటన చేయడం గమనార్హం. మసూద్‌ అజార్‌ దేశం విడిచి పారిపోయాడంటూ పాక్‌ ఆర్థిక వ్యవహారాల మంత్రి హమ్మద్‌ అజార్‌ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

అయితే పాక్‌ ప్రకటనలో ఎలాంటి వాస్తవం లేదని.. ఎఫ్‌ఏటీఎఫ్‌ సమావేశం నేపథ్యంలో అజార్‌, అతడి కుటుంబసభ్యులను ఓ భద్రమైన ఇంట్లో దాచిపెట్టారని భారత నిఘా వర్గాలు వెల్లడించాయి. బహవల్‌పూర్‌లోని మర్కాజ్‌ ఇ ఉస్మార్‌ ఓ అలీ ప్రాంతంలో గల జైషే ప్రధాన కార్యాలయం వెనుక ఓ బుల్లెట్‌ ఫ్రూప్‌ ఇంట్లో అత్యంత భద్రత నడుమ అజార్‌ ఉన్నట్లు పేర్కొన్నాయి. 

పారిస్‌ వేదికగా ఎఫ్ఏటీఎఫ్‌ సమావేశం ప్రారంభమైంది. ఉగ్రవాద నిర్మూలన, ముష్కరులకు నిధులు కట్టడిపై ఎఫ్‌ఏటీఎఫ్‌ మార్గదర్శకాలను పాకిస్థాన్‌ అనుసరించిందా లేదా అనే అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. దాన్ని ఆధారంగా చేసుకుని పాక్‌ను బ్లాక్‌ లిస్ట్‌లో చేర్చాలా వద్ద అన్న అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు.  
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని