ట్రంప్‌ ‘మెరైన్‌ వన్‌’కు ఐదు డికాయ్‌లు..
close
Updated : 23/02/2020 17:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ట్రంప్‌ ‘మెరైన్‌ వన్‌’కు ఐదు డికాయ్‌లు..

 అతిశక్తిమంతమైన హెలికాప్టర్‌ విశేషాలు ఇవి..

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఆయన వాహనశ్రేణి నెమ్మదిగా గుజరాత్‌ చేరుకొంటోంది. ప్రపంచ వ్యాప్తంగా ఆయన వాడే ‘ఎయిర్‌ఫోర్స్‌ వన్‌’ విమానం, లిమోజిన్‌ ‘బీస్ట్‌’ కారు విశేషాలు తరచూ పత్రికల్లో వస్తుంటాయి. కానీ, ట్రంప్‌ బీస్ట్‌లో ఎంత ప్రయాణిస్తారో.. మెరైన్‌ వన్‌ హెలికాప్టర్‌ను అదే స్థాయిలో వినియోగిస్తారు. ఆ హెలికాప్టర్‌ తాజాగా గుజరాత్‌ చేరుకొంది. ట్రంప్‌ గుజరాత్‌ చేరుకొన్నాక సర్దార్‌ వల్లభభాయ్‌ పటేల్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మోతేరా స్టేడియంకు దీనిలోనే ప్రయాణిస్తారని భావిస్తున్నారు. 

హెలికాప్టర్‌ విశేషాలు ఇవీ..

* మెరైన్‌ వన్‌ పేరుతో ఒకటే హెలికాప్టర్‌ ఉండదు. చాలా ఉంటాయి. అధ్యక్షుడి కోసం సికోర్స్కి కంపెనీ తయారు చేసిన ప్రత్యేకమైన హెలికాప్టర్‌ ఇది.  పాత వీహెచ్‌-3 మోడల్‌ను త్వరలోనే వీహెచ్‌-92ఏ మోడల్‌ రీప్లేస్‌ చేయనుంది. 

* ఈ హెలికాప్టర్‌ గంటకు 241 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. భారీ పేలుళ్లను తట్టుకొనేలా దీనికి బాలిస్టిక్‌ ఆర్మర్‌ ఉంది. క్షిపణి హెచ్చరిక వ్యవస్థతో పాటు.. క్షిపణి రక్షణ వ్యవస్థ కూడా ఉంది. 

* ఈ హెలికాప్టర్‌ లోపల 200 చదరపు అడుగుల స్థలం ఉంటుంది. దీనిలో ఒక బాత్‌రూమ్‌ కూడా ఉంది. మొత్తం 14 మంది హాయిగా ప్రయాణించేందుకు వీలుంది. 

* దీనికి ఉన్న మూడు ఇంజిన్లలో ఒకటి విఫలమైనా ఎగరగలదు. 

* అధ్యక్షుడు ఎక్కడకు వెళ్లినా ఆయనకు సేవలు అందించడానికి మెరైన్‌ వన్‌ హెలికాప్టర్‌ ఒకటి సిద్ధంగా ఉంటుంది. 

* ఈ హెలికాప్టర్‌ను మెరైన్‌ హెలికాప్టర్‌ స్క్వాడ్రన్‌ వన్‌(హెచ్‌ఎంఎక్స్‌-1) నడుపుతుంది. ఇది అమెరికా మెరైన్‌ ఫోర్స్‌లో భాగం. అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ఇతర కీలక అధికారుల రవాణాకు బాధ్యత వహిస్తుంది. 

* ఈ స్క్వాడ్రన్‌లోని నలుగురు పైలట్లను మాత్రమే హెలికాప్టర్‌ ఎక్కేందుకు అనుమతిస్తారు. వీరిని నైట్‌ వాక్స్‌ అని పిలుస్తారు. 

* ఈ మెరైన్‌ వన్‌తోపాటు మరో ఐదు డికాయ్‌ హెలికాప్టర్లు ఎప్పుడూ ప్రయాణిస్తాయి. అంటే ఒకే లాంటి హెలికాప్టర్లన్నమాట.. ఎందులో అధ్యక్షుడు ఉన్నాడో శత్రువులకు తెలియకుండా చేయడం కోసం వీటిని వాడతారు. 

* బీస్ట్‌కు(కార్లకు) ప్రత్యామ్నాయంగా హెలికాప్టర్లను వినియోగిస్తారు. 

* 1957లో ఐసన్‌ హోవర్‌ హెలికాప్టర్‌లో ప్రయాణించిన తొలి అమెరికా అధ్యక్షుడిగా పేరు తెచ్చుకొన్నారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని