వ్యాయామం చేస్తే.. రైల్వేస్టేషన్‌లో ఫ్రీ టికెట్‌
close
Published : 21/02/2020 15:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వ్యాయామం చేస్తే.. రైల్వేస్టేషన్‌లో ఫ్రీ టికెట్‌

దిల్లీ రైల్వే స్టేషన్లో వినూత్న ప్రయోగం

దిల్లీ: నేటి జీవన విధానంలో మన ఆరోగ్యానికి వ్యాయామం తప్పనిసరే అయినప్పటికీ ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఫిట్‌నెస్‌పై ఆసక్తి చూపించేవారు తక్కువే. అందుకే వ్యాయామాన్ని ప్రోత్సహించి ఆరోగ్యంపై ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు వినూత్న ప్రయోగం చేపట్టింది రైల్వేశాఖ. కొద్దిసేపు వ్యాయామం చేస్తే ఉచితంగా ప్లాట్‌ఫాం టికెట్‌ పొందే అవకాశం కల్పిస్తోంది. ప్రస్తుతం దిల్లీలోని ఓ రైల్వే స్టేషన్‌లో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. 

దిల్లీలోని ఆనంద్‌ విహార్‌ రైల్వే స్టేషన్‌లో కొత్తగా ఫిట్‌నెస్‌ మిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ మిషన్‌ ముందు కొద్దిసేపు సిటప్స్‌ చేస్తే ఉచితంగా ప్లాట్‌ఫాం టికెట్‌ వస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియోను కేంద్ర రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ‘ఫిట్‌నెస్‌తో పాటు పొదుపు కూడా.. ఫిట్‌నెస్‌ను ప్రోత్సహించేందుకు దిల్లీ ఆనంద్‌ విహార్‌ స్టేషన్‌లో వినూత్న ప్రయోగం ఇది’ అని గోయల్‌ పేర్కొన్నారు. 

ఇప్పటికే రష్యాలోని కొన్ని రైల్వే స్టేషన్లలో ఈ విధానం అందుబాటులో ఉంది. అక్కడ 30 సిటప్స్‌ చేస్తే ఉచితంగా రైల్వే టికెట్‌ తీసుకోవచ్చు. దీని నుంచి స్ఫూర్తి పొందే రైల్వే అధికారులు దిల్లీ స్టేషన్‌లో ఈ ఫిట్‌నెస్‌ మిషన్‌ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని