దిల్లీ ఘటనలపై అజిత్‌ డొభాల్ ఆరా...
close
Updated : 26/02/2020 11:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దిల్లీ ఘటనలపై అజిత్‌ డొభాల్ ఆరా...

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని ఈశాన్య ప్రాంతంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై జరుగుతున్న ఘటనలను అదుపులోకి తెచ్చేందుకు కేంద్రం ఆ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించింది. దీంతో పాటు దిల్లీ పోలీసు ప్రత్యేక కమిషనర్‌గా ఎన్‌ శ్రీవాస్తవను నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా మంగళవారం ఉన్నత స్థాయి అధికారులతో మూడో విడత సమావేశం నిర్వహించి పరిస్థితులపై సమీక్షించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డొభాల్ కూడా నిన్న అర్ధరాత్రి తర్వాత ఈశాన్య దిల్లీలోని సీలంపూర్‌ కమిషనర్ కార్యాలయాన్ని సందర్శించి అక్కడి  పరిస్థితులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకొన్నారు. ఆందోళనల నేపథ్యంలో బుధవారం జరగాల్సిన సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలను వాయిదా వేశారు.

కేజ్రీవాల్ నివాసం ముందు నిరసనలు

దిల్లీలో ఆందోళనలకు కారణమైన వారిపై చర్యలు తీసుకొని, నగరంలో శాంతిని నెలకొల్పాలని జామియా మిలియా ఇస్లామియా పూర్వ విద్యార్థుల సంఘం (ఏఏజేఎమ్‌ఐ), జామియా కోఆర్డినేషన్ కమిటీ (జేసీసీ) సభ్యులు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ మేరకు వారంతా ముఖ్యమంత్రి నివాసం బయట నినాదాలు చేశారు. కేజ్రీవాల్‌ స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి హింస చెలరేగిన ప్రాంతాల్లో పీస్‌ మార్చ్‌ నిర్వహించాలని డిమాండ్ చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని