కపిల్‌ మిశ్రా వీడియో పోలీసులు చూడలేదా?
close
Published : 26/02/2020 14:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కపిల్‌ మిశ్రా వీడియో పోలీసులు చూడలేదా?

అసహనం వ్యక్తం చేసిన దిల్లీ హైకోర్టు

దిల్లీ: ఈశాన్య దిల్లీలో చోటుచేసుకున్న ఘటనల్లో పోలీసులు ప్రవర్తించిన తీరుపై దిల్లీ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.  భాజపా నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లున్న వీడియోలను పోలీసులు ఇంకా చూడకపోవడంపై మండిపడింది. వెంటనే ఆయా నేతలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసే విషయమై సూచనలు ఇవ్వాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను ఆదేశించింది. 

దిల్లీ ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి బాధ్యులను అరెస్టు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై న్యాయస్థానం నేడు విచారణ జరిపింది. ప్రస్తుతం దిల్లీలో తీవ్రమైన, ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఘటనలకు ముందు భాజపా నేత కపిల్‌ మిశ్రా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను చూశారా? అంటూ విచారణ సందర్భంగా దిల్లీ పోలీసులను కోర్టు ప్రశ్నించింది. అలాంటి వీడియో ఏదీ తాము చూడలేదని డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ చెప్పగానే ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అయితే ఇప్పుడు చూడండి అంటూ కపిల్‌ మిశ్రా వీడియోను కోర్టు గదిలోనే ప్రదర్శించింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది. 

ఇవీ చదవండి..

అమిత్ షా రాజీనామాకు సోనియా డిమాండ్‌

దిల్లీ ఘటనలు విచారకరం: సుప్రీంకోర్టు

సైన్యాన్ని పిలిపించండి: కేజ్రీవాల్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని