కొవిడ్‌తో అమెరికాలో ఆరుగురి మృతి
close
Updated : 03/03/2020 11:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌తో అమెరికాలో ఆరుగురి మృతి

వాషింగ్టన్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్‌-19(కరోనా) వైరస్‌ అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటి వరకు మొత్తం ఆరుగురిని పొట్టనబెట్టుకుంది. మృతులంతా వాషింగ్టన్‌ రాష్ట్రానికి చెందినవారే. ఇక అమెరికాలో మొత్తం 91 మందికి వైరస్ సోకినట్లు ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ వెల్లడించారు. వీరిలో 43 మందికి అమెరికాలోనే సోకగా.. మరో 48 మంది విదేశాల నుంచి తిరిగొచ్చిన వారని తెలిపారు. అమెరికాలో తొలి మరణం శనివారం సంభవించిన విషయం తెలిసిందే. 

> మరోవైపు కొవిడ్‌-19కు వచ్చే వేసవి లేదా వర్షాకాలం ఆరంభం నాటికి చికిత్స అందుబాటులోకి వస్తుందని పెన్స్‌ తెలిపారు. వాక్సిన్‌ కోసం మాత్రం ఈ ఏడాది చివరి వరకూ వేచి చూడాల్సిందేనన్నారు. ఇప్పటికే పలు రకాల ఔషధాలను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారని వెల్లడించారు. అమెరికాలో వేసవి జూన్‌ నుంచి ప్రారంభమవుతుంది.

> చైనాలో మరో 125 మందికి వైరస్‌ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. గత ఆరు వారాల్లో కొత్తగా సోకిన వారి సంఖ్య ఇదే తక్కువ కావడం గమనార్హం. ఇక మరో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో చైనాలో కరోనా మరణాల సంఖ్య 2,943కు చేరింది. 

> దక్షిణ కొరియాలో కొత్తగా 473 మందికి కరోనా సోకింది. దీంతో బాధితుల సంఖ్య అక్కడ 4,680 దాటింది. 

> పాకిస్థాన్‌లో కొత్తగా ఒక కేసు నమోదుకావడంతో బాధితుల సంఖ్య ఐదుకు చేరింది.

> ఇటు భారత్‌లోనూ రెండు కొత్త కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు మన దేశంలో ఐదు కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. వైరస్‌ను కట్టడి చేసేందుకు పటిష్ఠ చర్యలు ప్రారంభించాయి.

ఇవీ చదవండి..

ఎవరెవరికి సోకిందో?
రాష్ట్రంలో కరోనా ఘంటిక

శుభ్రతే వైరస్‌కు చక్కటి మందుమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని