కరోనా అనుమానితులు.. చెప్పకుండా వెళ్లారు!
close
Published : 15/03/2020 01:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా అనుమానితులు.. చెప్పకుండా వెళ్లారు!

ముంబయి: మహారాష్ట్రలోని నాగపూర్‌లో కరోనా లక్షణాలు ఉన్న నలుగురు వ్యక్తులు సిబ్బందికి చెప్పకుండా ఆస్పత్రి నుంచి వెళ్లిపోవడం కలకలం సృష్టించింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వారిని గుర్తించి మళ్లీ ఆస్పత్రికి రమ్మని సూచించినట్లు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగపూర్‌లోని ఇందిరాగాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి శుక్రవారం ఉదయం నలుగురు వ్యక్తులు వచ్చారు. వారికి కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్షలు నిర్వహించిన సిబ్బంది ఫలితం తేలే వరకు వారిని ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి వారు సిబ్బందికి చెప్పకుండా ఆస్పత్రి నుంచి వెళ్లిపోయారు. దీంతో ఆందోళనకు గురైన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వారికి ఫోన్‌ చేసి ఆరా తీసి.. వెంటనే ఆస్పత్రికి రావాలని సూచించినట్లు తెలిపారు. ‘పరీక్ష ఫలితాలు ఆలస్యం కావడంతోనే ఇంటికి వెళ్లాం. అంతేకాకుండా ఆస్పత్రిలో కరోనా పాజిటివ్‌ ఉన్న వారితో పాటు తామూ శౌచాలయాలు పంచుకోవడం ఆందోళన కలిగించింది’అని వారు చెప్పినట్లు పోలీసులు తెలిపారు.  ఆ నలుగురు వ్యక్తులకు సంబంధించి కరోనా పరీక్ష ఫలితాలు ఇంకా రావాల్సి ఉండటం గమనార్హం. 

నాగపూర్‌లో ఇప్పటివరకు ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మహారాష్ట్రలో మొత్తం 19మందికి కరోనా సోకినట్లు సమాచారం. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని