ఆ దేశాలకు వెళ్లొద్దు: ఉగ్రవాదులకు ఐసిస్‌ సూచన
close
Published : 15/03/2020 15:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ దేశాలకు వెళ్లొద్దు: ఉగ్రవాదులకు ఐసిస్‌ సూచన

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించిన ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ ఇప్పుడు కరోనా వైరస్‌కు (కొవిడ్‌-19) భయపడుతోంది. కరోనా విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆ వైరస్‌ ప్రభావిత దేశాలకు వెళ్లొద్దంటూ ఐసిస్‌ తమ ఉగ్రవాదులకు సూచించింది. కరోనా మహమ్మారి వ్యాపించిన దేశాలకు వెళ్లొద్దంటూ తమ ‘అల్‌-నబా’ మ్యాగజైన్‌లో ప్రచురించింది.

అంతేకాదు, ఎప్పటికిప్పుడు చేతులు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ఉగ్రవాదులకు తెలిపింది. మధ్యరాత్రిలో నిద్రలేచినా సరే, చేతులు కడుక్కొని పడుకోవాలని తెలిపింది. అనారోగ్యంత బాధపడేవారికి దూరంగా ఉండటంతో పాటు, కరోనా ప్రభావిత దేశాలకు వెళ్లొద్దంటూ ఐసిస్‌ ప్రకటన విడుదల చేసినట్లు డైలీ మెయిల్‌ తెలిపింది. ఆరోగ్య నిపుణులు సూచించిన జాగ్రత్తలు పాటించాలని, బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని తెలిపింది.

ప్రస్తుతం చైనాలో తగ్గుముఖం పట్టిన కరోనా, ప్రపంచదేశాల్లో వ్యాపిస్తోంది. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి 5వేలమంది చనిపోగా, 1.35లక్షలమందికి కరోనా సోకింది. భారత్‌లో కరోనా బారినపడిన వారి సంఖ్య 93కే చేరగా, ఇద్దరు చనిపోయారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని