కరోనా ఎఫెక్ట్‌: వాఘా సరిహద్దు మూసివేత
close
Published : 19/03/2020 17:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా ఎఫెక్ట్‌: వాఘా సరిహద్దు మూసివేత

ఇస్లామాబాద్‌: దాయాది దేశాల్లో కొవిడ్‌19 వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత సమయంలో ముందస్తు జాగ్రత్తగా భారత్‌-పాక్‌లను కలిపే  వాఘా సరిహద్దును మూసివేస్తున్నట్టు పాక్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే ఆ దేశంలో కొవిడ్‌19 బారిన పడి ఇద్దరు వ్యక్తులు మరణించగా 341 మందిలో ఈ వైరస్‌ లక్షణాలు కనిపించాయి. అందులో భాగంగానే వైరస్‌ను ఆదిలోనే నివారించేందుకు 14 రోజులపాటు సరిహద్దు మూసివేస్తునట్టు ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది. ఇప్పటికే పాక్‌కు పశ్చమాన ఉన్న ఇరాన్‌, అఫ్గనిస్థాన్‌ సరిహద్దులను మూసివేసింది. ఆ దేశంలోని ముస్లింలు, ఇతర మతాలవారు ఆధ్యాత్మికయాత్రలను వాయిదా వేసుకోవాలని మతవ్యవహారాలశాఖమంత్రి నూర్‌ ఉల్‌ ఖాద్రీ సూచించారు. ఇప్పటికే క్రైస్తవ ఫాదర్లు మతప్రార్థనలను చర్చిలో నిర్వహించడం ఆపేశారు. కరోనావైరస్‌పై వదంతులు వ్యాప్తిచెందకుండా మీడియా సైతం జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రశ్నలను ఇ-మెయిల్‌లో పంపితే వైరస్‌ ప్రభావానికి సంబంధించిన వివరాలను తెలుపుతామని ఆ దేశ విదేశీ వ్యవహారాలశాఖ అధికారప్రతినిధి అషియాఫరూకీ తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని