పాక్‌లో 17కి చేరిన కరోనా మృతులు
close
Published : 30/03/2020 14:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాక్‌లో 17కి చేరిన కరోనా మృతులు

ఇస్లామాబాద్‌ : కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి బారిన పడి వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. బ్రిటన్‌, స్పెయిన్‌, ఐరోపా, అమెరికాలతోపాటు పాకిస్థాన్‌లో కూడా ఈ వైరస్‌ తీవ్రంగా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడిలో భాగంగా  ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌ వ్యూహం పాటిస్తున్నప్పటికీ  బాధితులు, మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. 
తాజా సమాచారం ప్రకారం ఇప్పటి వరకు పాకిస్థాన్‌లో 1600 కరోనా పాజిటీవ్‌ కేసులు వెలుగులోకి రాగా.. మృతుల సంఖ్య 17కి చేరిందని సోమవారం అక్కడి వైద్యాధికారులు వెల్లడించారు. దక్షిణాది దేశాలతో పోలిస్తే పాక్‌లోనే  కొవిడ్‌ 19 కేసులు ఎక్కువగా నమోదయ్యాయని వారు తెలిపారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని