కరోనా భయంతో అడవుల్లోకి..
close
Published : 04/04/2020 00:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా భయంతో అడవుల్లోకి..

వైరస్‌, ఆకలి రెండు మా ప్రాణం తీసేవే

 

కౌలలంపూర్‌: కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర ఆందోళనలకు కారణమవుతుంది. బయటి నుంచి వచ్చే వ్యక్తులను ఊళ్లలోకి రానీయకుండా సరిహద్దుల్లో కంచెలతో అడ్డుకుంటున్న తీరు కనిపిస్తోంది. మలేషియాలో ఆరెంజ్ అస్లి అనే ఆదిమ తెగ అయితే తాము ఉండే ఊరిని వదిలేసి అడవుల్లోకి వెళ్లి తలదాచుకుంటోంది. ‘వేరుగా జీవించడానికి మేము తిరిగి అడవుల్లోకి వెళ్లిపోతున్నాం. అక్కడే ఆహారాన్ని సంపాదించుకుంటాం’ అని ఆ దేశంలోని జమేరీ గ్రామస్థుడు మీడియాకు వెల్లడించారు. 

మలేషియాలో ఆదిమ జాతి అయిన వీరు పేదరికంలో జీవిస్తున్నారు. వీరిలో పోషకాహారలోపం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ దేశంలో ఇప్పటివరకు వారిలోనే వైరస్‌ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.  కూరగాయలు, పండ్లు అమ్ముకుంటే వచ్చే ఆదాయమే వారికి జీవనాధారం. ఇప్పుడు ఆ కొద్దిపాటి రాబడి కూడా తగ్గిపోవడంతో తిండికి ఇబ్బంది పడాల్సి వస్తోంది. కొవిడ్‌ భయంతో ఆహారం కొనుగోలుకు పట్టణం వైపు చూడాలంటే వణికిపోతున్నారు ఆ ఆదిమ జాతి ప్రజలు. తలదాచుకోడానికి అడవుల్లోకి వెళ్లిన వారు మాత్రం తమకు అక్కడ ఆహారాన్ని ఎలా సేకరించుకోవాలో తెలుసని చెప్తున్నారు. మరి కొంతమంది ఆహారం కోసం కూడా అడవుల్లోకి వెళ్లడానికి భయపడుతున్నారు. ఈ పరిస్థితుల తీవ్రతను గమనించి ఓ వృద్ధుడు మాత్రం వైరస్‌, ఆకలి రెండు తమ ప్రాణాలు తీసేవేనని వాపోయాడు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని