మూడో వంతు కేసులు ఈ జిల్లాల్లోనే
close
Published : 06/04/2020 20:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మూడో వంతు కేసులు ఈ జిల్లాల్లోనే

దిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా నిజాముద్దీన్‌ మర్కజ్‌ ఘటన అనంతరం దీని తీవ్రత పెరిగింది. 9 రాష్ట్రాల్లోని 12 జిల్లాల్లో ఈ సంఖ్య ఎక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా 284 జిల్లాలు ఈ మహమ్మారి బారిన పడ్డాయి. ఇప్పటి వరకు దేశం మొత్తమ్మీద నమోదైన కేసుల్లో మూడో వంతు కేసులు ఈ జిల్లాల్లో నమోదు కావడం గమనార్హం.

దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4281 (సాయంత్రం 6 గంటల వరకు వైద్యారోగ్య శాఖ డేటా ప్రకారం) నమోదు కాగా.. అందులో దాదాపు 1300కు పైగా కేసులు ఈ 12 జిల్లాల్లోనే నమోదయ్యాయి. ఈ జాబితాలో దక్షిణ దిల్లీ అగ్రస్థానంలో ఉంది. ముంబయి రెండోస్థానంలో ఉంది. హైదరాబాద్‌ నాలుగో స్థానంలో ఉండడం గమనార్హం. 100కు పైగా కేసులున్న జిల్లాల్లో కేరళలోని కసోర్‌గోడ్‌, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ ఉన్నాయి. చెన్నై (తమిళనాడు), పుణె (మహారాష్ట్ర), గౌతమ్‌ బుద్ధనగర్ (యూపీ)‌, జైపూర్ (రాజస్థాన్‌)‌, అహ్మదాబాద్ (గుజరాత్‌)‌, యాదాద్రి (తెలంగాణ), కన్నూర్‌ (కేరళ) జిల్లాలు 50కి పైగా కేసులున్న జాబితాలో ఉన్నాయి. కేసుల తీవ్రత ఆధారంగా ఈ విధంగా జిల్లాలను విభజించి అక్కడ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని వైద్యారోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ ఏప్రిల్‌ 14 తర్వాత లాక్‌డౌన్‌ను ఎత్తివేసినప్పటికీ ఏయే జిల్లాల్లో లాక్‌డౌన్‌ పొడిగించాల్సిన అవసరం ఏర్పడుతుందో తెలుసుకునేందుకు వీలుపడుతుందని తెలిపాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని