లాక్‌డౌన్‌తో ఆకలి చావులు: ఇమ్రాన్‌ఖాన్‌
close
Updated : 09/04/2020 17:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాక్‌డౌన్‌తో ఆకలి చావులు: ఇమ్రాన్‌ఖాన్‌

పరిస్థితి మరింత దిగజారవచ్చంటున్న పాక్‌ ప్రధాని

దిల్లీ: దాయాదిదేశం పాక్‌లో కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) కేసులు బుధవారం నాటికి 4,183కు చేరుకున్నాయి. తమ ఆస్పత్రుల్లో కరోనా రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో... పరిస్థితి మరింత దిగజారవచ్చని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వెల్లడించారు. కరోనాను ఎదుర్కోవటానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నప్పటికీ, రానున్న కాలంలో పరిస్థితిని తట్టుకోవటం కష్టమేనని ఆయన అభిప్రాయపడ్డారు. కనుక దేశ ప్రజలందరూ ప్రభుత్వ ఆరోగ్యశాఖ సూచనలు, జాగ్రత్తలకు కట్టుబడి ఉండాలని ఇమ్రాన్‌ హెచ్చరించారు. కరోనా నిరోధక చర్యల్లో భాగంగా పాకిస్థాన్‌లో ఏప్రిల్‌ 14 వరకు పాక్షిక మూసివేత అమలులో ఉండనుంది. కాగా, సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించకూడదన్న తమ ప్రభుత్వ నిర్ణయాన్ని మాజీ క్రికెటర్‌, ప్రస్తుత ప్రధాని అయిన ఇమ్రాన్‌ ఖాన్‌ సమర్ధించుకున్నారు. ఐదు కోట్లకు పైగా ప్రజలు దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న తమ దేశంలో లాక్‌డౌన్‌ నిర్ణయం ఆకలిచావులకు దారితీస్తుందని ఆయన వెల్లడించారు.

కరోనా కాలంలో రూ.144బిలియన్ల వ్యయంతో 112 మిలియన్ల పేదప్రజలు లబ్ది పొందే ‘ఎహసాస్‌ ఎమర్జెన్సీ క్యాష్ ప్రోగ్రామ్‌’ పథకాన్ని పాక్‌ నేడు ప్రారంభించనుంది. దీనిలో భాగంగా కరోనా పాక్షిక లాక్‌డౌన్‌ వల్ల గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటున్న పేదకుటుంబాలకు నెలకు రూ.12,000 చొప్పున అందచేస్తామని ఇమ్రాన్‌ ఖాన్‌ తెలిపారు. ఈ నగదు పంపిణీ రెండు నుంచి మూడు వారాల్లో జరుగుతుందని ఆయన వివరించారు. తమ దేశంలో కరోనా సహాయక కార్యక్రమం ‘కరోనా టైగర్‌ ఫోర్స్‌’ కార్యకలాపాల్లో స్వచ్ఛందంగా పాల్గొనటానికి 7,50,000 మందికి పైగా యువత ముందుకొచ్చారని పాక్‌ ప్రధాని వెల్లడించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని