సార్క్‌ కరోనా ఫండ్‌కు పాక్‌ 3 మిలియన్‌ డాలర్లు
close
Published : 10/04/2020 11:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సార్క్‌ కరోనా ఫండ్‌కు పాక్‌ 3 మిలియన్‌ డాలర్లు

ఇస్లామాబాద్‌: కరోనా మహమ్మారిపై పోరుకు ప్రధాని మోదీ ప్రతిపాదించిన సార్క్‌ ఎమర్జెన్సీ ఫండ్‌కు పాక్‌ ఎట్టకేలకు నిధులు అందించడానికి ముందుకు వచ్చింది. మూడు మిలియన్ డాలర్లు అందజేస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు గురువారం పాక్‌ విదేశాంగ కార్యదర్శి.. సార్క్‌ ప్రధాన కార్యదర్శి ఎసలా రువాన్‌ వీరకూన్‌కు సమాచారం అందజేశారు. అయితే, నిధుల అందజేత నిర్ణయాన్ని తెలియజేస్తూ పలు కొర్రీలు వేసినట్లు అర్థమవుతోంది. నిధులకు సంబంధించిన అన్ని ప్రక్రియలు సార్క్‌ కార్యదర్శి నియంత్రణలోనే ఉండాలని తెలిపారు. అలాగే, నిధుల వినియోగం విషయంలో అన్ని సభ్యదేశాలను సంప్రదించి.. విస్తృతంగా చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కోరారు.

కొవిడ్‌పై పోరాటంలో సార్క్‌ దేశాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో ప్రధాని మోదీ ప్రధాన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. వైరస్‌ను నిలువరించేందుకు అత్యవసర నిధిని ప్రతిపాదించి.. భారత్‌ తరఫున తొలుత రూ.74 కోట్లు (కోటి డాలర్లు) ప్రకటించారు. అనంతరం నేపాల్‌, అఫ్గానిస్థాన్‌, మాల్దీవులు, బంగ్లాదేశ్‌, శ్రీలంక సైతం నిధుల అందజేతకు ముందుకు వచ్చాయి. దాదాపు నెల రోజుల తర్వాత.. అదీ పాకిస్థాన్‌లో వైరస్‌ విజృంభణ తీవ్రమైన తరుణంలో పాకిస్థాన్‌ స్పందించడం గమనార్హం. 

 

ఇవీ చదవండి..

‘కేర్‌’ళభళా

ఏపీలో మరో రెండు పాజిటివ్‌ కేసులుమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని