పాక్‌, బంగ్లా సరిహద్దుల వద్ద నిఘా పెంచండి:షా
close
Published : 11/04/2020 00:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాక్‌, బంగ్లా సరిహద్దుల వద్ద నిఘా పెంచండి:షా

దిల్లీ: పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో బీఎస్‌ఎఫ్‌ జవాన్లు నిరంతరం నిఘా వేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆదేశించారు. ముఖ్యంగా కంచె లేని ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా వైరస్‌ సోకిన పాక్‌ ఉగ్రవాదులు భారత్‌లో వైరస్‌ వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఎస్‌ఎస్‌బీ సమాచారంతో కేంద్రం అప్రమత్తమైంది. 

రెండు దేశాలతో సరిహద్దుల వద్ద భద్రతపై బీఎస్‌ఎఫ్‌ అధికారులతో అమిత్‌ షా వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం నిర్వహించారు. ఆ దేశాల నుంచి ఎవ్వరూ సరిహద్దులు దాటకుండా చూడాలని మంత్రి ఆదేశించారని హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాస్తవ మీడియాకు తెలిపారు. సరిహద్దుల్లోని రైతులకు కొవిడ్‌-19 మహమ్మారిపై అవగాహన కల్పించాలని, జాగ్రత్తలు పాటించేలా చూడాలని అమిత్‌షా కోరారు. సరిహద్దు జిల్లాల అధికారవర్గాలతో సమన్వయం చేసుకోవాలని బీఎస్‌ఎఫ్‌కు ఆయన ఆదేశించారని తెలిసింది.

హోంశాఖ సమాచారం ప్రకారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 37,978 సహాయ కేంద్రాలు నడుస్తున్నాయని శ్రీవాస్తవ తెలిపారు. 14.3 లక్షల మంది వలస కూలీలు శిబిరాల్లో తలదాచుకుంటున్నారని పేర్కొన్నారు. 26,225 ఆహార వితరణ కేంద్రాల్లో కోటికి పైగా ఆకలి తీర్చుకుంటున్నారని వెల్లడించారు. 16.5 లక్షల మందికి యజమానులే ఆహారం, ఆశ్రయం కల్పించారని తెలిపారు. కొవిడ్‌-19ను నియంత్రించేందుకు అన్ని పట్టణ, గ్రామాల పాలక వర్గాలతో సమన్వయంతో పనిచేస్తున్నామని శ్రీవాస్తవ వివరించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని