అది కరోనా కంటే పెద్ద సంక్షోభం..: కమల్‌హాసన్‌
close
Updated : 15/04/2020 11:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అది కరోనా కంటే పెద్ద సంక్షోభం..: కమల్‌హాసన్‌

చెన్నై: లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయి, సొంతూళ్లకు వెళ్లలేకపోయిన వలస కార్మికుల దుస్థితిపై మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్ స్పందించారు. ప్రభుత్వాలు బాల్కనీ నుంచి కొంచెం కిందికి చూసి వారి పరిస్థితిని అర్థం చేసుకోవాలని విమర్శించారు. కరోనా వైరస్‌ ఉద్ధృతి నేపథ్యంలో మే 3 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి నిర్ణయం వెలువడగానే పెద్ద ఎత్తున వలసకార్మికులు ముంబయిలోని బాంద్రా స్టేషన్‌ వద్ద గుమిగూడారు. వారిని అక్కడినుంచి పంపించి వేయడానికి  పోలీసులు లాఠీఛార్జి చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆ వలస జీవుల భావోద్వేగాలతో ఆడుకోవద్దంటూ.. వారికి తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ ఘటనపై కమల్ హాసన్ ట్విటర్ వేదికగా విమర్శలు చేశారు. ‘బాల్కనీలో ఉండేవారికి కిందికి చూడటం కష్టమవుతుంది. మొదట దిల్లీలో ఈ పరిస్థితి. ఇప్పుడు ముంబయి. వలసకార్మికుల సంక్షోభం అనేది ఒక టైమ్ బాంబ్‌ లాంటిది. అది కరోనా కంటే పెద్ద సంక్షోభం కాకముందే తగ్గించాలి. బాల్కనీ ప్రభుత్వాలు కింద కూడా ఏం జరుగుతుందో చూడాలి’ అని విరుచుకుపడ్డారు. ఇప్పటికే కరోనా వైరస్‌ హాట్‌స్పాట్‌గా ఉన్న ముంబయిలో వలస కార్మికులు గుమిగూడటంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల్లో సగానికి పైగా ముంబయిలోనే ఉండటం అక్కడి వైరస్‌ తీవ్రతకు అద్దం పడుతోంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని