మరో వ్యాక్సిన్‌ను పరీక్షిస్తున్న భారత శాస్త్రవేత్తలు
close
Published : 18/04/2020 00:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మరో వ్యాక్సిన్‌ను పరీక్షిస్తున్న భారత శాస్త్రవేత్తలు

దిల్లీ: కరోనాను కట్టడి చేసేందుకు భారతీయ శాస్త్రవేత్తలు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. లెప్రసీపై సమర్థంగా పనిచేసిన బహుళ ప్రయోజనాలున్న వ్యాక్సిన్‌.. కొవిడ్‌-19పై పనిచేస్తుందో లేదో పరీక్షిస్తున్నారు. రోగనిరోధక శక్తిని పెంచే గుణమున్న ఈ వ్యాక్సిన్‌ మహమ్మారిపై ఎలా పోరాడుతుందో పరీక్షిస్తున్నామని సీఎస్‌ఐఆర్‌ తెలిపింది.

‘డీసీజీఐ ఆమోదం తెలపడంతో లెప్రసీకి ఉపయోగించే ఎండబ్ల్యూ వ్యాక్సిన్‌ను మేం పరీక్షిస్తున్నాం. కొత్త వ్యాక్సిన్‌ను తయారు చేయడం సుదీర్ఘ ప్రక్రియ. ప్రస్తుతం పరిశోధనలు కొనసాగుతున్నాయి. రోగ నిరోధక శక్తిని మెరుగుపరిచే వ్యాక్సిన్‌ కోసం మేం కృషి చేస్తున్నాం. మరో రెండు అనుమతుల కోసం ఎదురు చూస్తున్నాం. రాగానే ట్రయల్స్‌ మొదలుపెడతాం. ఆరు వారాల్లోనే ఫలితాలు తెలుస్తాయి’ అని సీఎస్‌ఐఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ శేఖర్‌ మండె అన్నారు.

వైరస్‌ జీనోమ్‌ సీక్వెన్స్‌పై భారత్‌ పనిచేస్తోందని డాక్టర్‌ మండె వెల్లడించారు. వైరస్‌ పుట్టుక, వ్యాప్తిని కనుగొనేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఔషధాలకు నిరోధకత పెంచుకుంటుందా, దాడి చేస్తుందా తెలుస్తుందన్నారు. ‘పుణెలోని వైరాలజీ కేంద్రం (ఎన్‌ఐవీ) 25 సీక్వెన్స్‌లు రూపొందించింది. మాకున్న రెండు ప్రయోగశాలల్లో మేం 30 సీక్వెన్స్‌లు చేశాం. వచ్చే రెండు వారాల్లో 500-1000 చేయగలం’ అని ఆయన తెలిపారు.

‘ప్రస్తుతం ప్రపంచంలో ఆరు నుంచి ఏడు రకాల కరోనా స్ట్రెయిన్స్‌ ఉన్నాయి. భారత్‌లో ఎన్ని ఉన్నాయో ఇప్పుడే చెప్పడం తొందరపాటే అవుతుంది. ఎక్కువ సీక్వెన్స్‌లు చేసేకొద్దీ వివరాలు తెలుస్తాయి’ అని డాక్టర్‌ మండె వెల్లడించారు.

చదవండి: అక్కడ 3 లక్షల మంది చనిపోతారు

చదవండి: నకిలీ కరోనాపై యుద్ధం


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని