మృగరాజులం..లాక్‌డౌన్‌ అయితే మాకేంటి?
close
Published : 18/04/2020 00:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మృగరాజులం..లాక్‌డౌన్‌ అయితే మాకేంటి?

ఇంటర్నెట్ డెస్క్‌: కరోనా భయంతో జన జీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. అందరూ ఇళ్లకే పరిమితమై పోవడంతో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో ఇన్నాళ్లూ అడవుల్లో నివసించే వన్యప్రాణులకు స్వేచ్ఛ లభించినట్లయింది. నెమళ్లు, జింకలు లాంటివి చుట్టు పక్కల ఊళ్లలోకి ప్రవేశించి తిరుగాడుతున్నాయన్న వార్తలు వింటూనే ఉన్నాం. మరోవైపు లాక్‌డౌన్‌ కారణంగా సందర్శకులతో కలకల లాడే నేషనల్‌ పార్కులు కూడా మూతపడ్డాయి. దీంతో లాక్‌డౌన్‌ కేవలం మనుషులకే... మాకేం కాదు అన్నట్లు అక్కడి జంతువులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. తాజాగా దక్షిణాఫ్రికాలో ఉన్న క్రుగెర్‌ నేషనల్‌ పార్క్‌లోని సింహాలు స్వేచ్చగా రోడ్లపై  సేదతీరుతున్న ఫోటోలను అక్కడి సిబ్బంది పార్క్‌ అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ‘‘సందర్శకులు లేకపోవడంతో క్రుగెర్‌ నేషనల్ పార్క్‌లో ఉన్న కెంపైనా కాంట్రాక్చువల్ పార్క్‌లోని సింహాలు రోడ్లపై సేదతీరుతున్నాయి. సాధారణ రోజుల్లో ట్రాఫిక్‌ వల్ల సింహాలు ఇంత స్వేచ్ఛగా రోడ్లపైకి రావు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ అమలులో ఉండటంతో వాహనాల రాకపోకలు లేకపోవడంతో ఇలా తమదైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నాయి’’ అని తెలిపారు. అంతేకాకుండా లాక్‌డౌన్ వల్ల వన్య ప్రాణుల ప్రవర్తనలో కూడా మార్పులు చోటుచేసుకుంటున్నాయని పార్క్‌ అధికారులు చెబుతున్నారు.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని