24 గంటల్లో కొత్తగా 1540 కేసులు
close
Published : 20/04/2020 19:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

24 గంటల్లో కొత్తగా 1540 కేసులు

దిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1540 పాజిటివ్‌ కేసులు (ఏప్రిల్‌ 20 సాయంత్రం 5 గంటల వరకు) నమోదయ్యాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 17,656కు చేరగా.. మరణించిన వారి సంఖ్య 559కి చేరిందని వెల్లడించింది. ఈ మహమ్మారి నుంచి ఇప్పటి వరకు 2841 మంది కోలుకున్నారని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 14,255 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

(గోవాలో ‘జీరో కరోనా‌’: ఈ వైద్యుడి చలవే...)

దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా పాజిటివ్‌ కేసులు ఉన్న రాష్ట్రాలు ఏడు ఉన్నాయి. మహారాష్ట్రలో ఈ సంఖ్య 4 వేలు, దిల్లీలో 2వేలు దాటింది. మహారాష్ట్రలో 4203 మంది కరోనా బారిన పడగా 223 మంది మరణించారు. దిల్లీలో కరోనా కేసుల సంఖ్య 2003కు చేరింది. 45 మంది మరణించారు. గుజరాత్‌ (1851), మధ్యప్రదేశ్‌ (1485), రాజస్థాన్‌ (1478), తమిళనాడు (1477), యూపీ (1176) రాష్ట్రాలు కేసుల పరంగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గోవాలో కరోనా బారిన పడిన వారంతా కోలుకోవడంతో అక్కడ ఒక్క కరోనా బాధితుడు కూడా లేకపోవడం గమనార్హం. మరోవైపు ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేసుల సంఖ్య తక్కువగా ఉంది. రాష్ట్రాల వారీగా వివరాలు కింది పట్టికలో..



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని