ప్రపంచమంతా ఓ బాధైతే.. పాక్‌ది మరో బాధ!
close
Published : 21/04/2020 14:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రపంచమంతా ఓ బాధైతే.. పాక్‌ది మరో బాధ!

గుట్టు చప్పుడు కాకుండా ఉగ్రవాదుల జాబితా సవరణ

న్యూయార్క్‌: పాకిస్థాన్‌ మరోసారి తన నీచపు బుద్ధిని బయట పెట్టుకుంది. ఓవైపు ప్రపంచమంతా కరోనా మహమ్మారిని ఓడించేందుకు తిరుగులేని పోరాటం చేస్తుంటే.. పాక్‌ మాత్రం అదేదో అత్యవసర కార్యమన్నట్లు నిషేధిత ఉగ్రవాదుల జాబితాను సవరించింది. ప్రపంచ దేశాలు మహమ్మారి మెడలు వంచేందుకు వ్యుహాలు రచిస్తూ తీరిక లేకుండా ఉంటే.. దాయాది దేశం మాత్రం గుట్టుచప్పుడు కాకుండా 1,800 మంది నిషేధిత ఉగ్రవాదుల్ని జాబితా నుంచి తొలగించింది. అందులో 2008 ముంబయి పేలుళ్ల సూత్రధారి, లష్కరే తొయిబా ఆపరేషన్స్‌ కమాండర్‌ జకీర్‌-ఉర్‌-రెహ్మాన్‌ లఖ్వీ సైతం ఉన్నట్లు సమాచారం. దీన్ని అమెరికాకు చెందిన ఓ అంకుర సంస్థ బయటపెట్టింది.

న్యూయార్క్‌ కేంద్రంగా పనిచేస్తున్న క్యాస్టెల్లమ్‌.ఏఐ అనే టెక్నాలజీ కంపెనీ ప్రకారం.. 2018లో నిషేధిత జాబితాలో 7,600గా ఉన్న ఉగ్రవాదుల సంఖ్య.. ఇప్పుడు 3,800కి చేరింది. గత మార్చి నుంచి ఏకంగా 1,800 మందిని ఈ జాబితా నుంచి తొలగించినట్లు క్యాస్టెల్లమ్‌ గుర్తించింది. 

పాకిస్థాన్‌ను ఇప్పటికే ఆర్థిక చర్యల కార్యదళం(ఎఫ్‌ఏటీఎఫ్‌) ‘గ్రే’ జాబితాలో పెట్టిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై జూన్‌లో మరోసారి సమీక్ష జరపనుంది. ఈ నేపథ్యంలో బ్లాక్‌లిస్ట్‌ ముప్పు తప్పించుకునేందుకే పాక్‌ ఈ చర్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఏఫ్‌టీఎఫ్‌ సిఫార్సుల్ని సమర్థంగా అమలు చేస్తున్నామని నమ్మబలికించడానికే ఈ కార్యానికి శ్రీకారం చుట్టినట్లు అర్థమవుతోంది. నిషేధిత ఉగ్రవాదుల్ని తొలగించినపుడు ఆ విషయాన్ని ప్రపంచం దృష్టికి తీసుకురావాలన్న నిబంధనలు ఉన్నాయి. కానీ, వాటిని పాక్‌ ఏ మాత్రం ఖాతరు చేయలేదు. ఈ మేరకు ప్రముఖ అమెరికన్‌ దినపత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌లో కథనం ప్రచురితమైంది. తొలగించిన తీరు, వేగం పలు అనుమానాలకు తావిస్తోందని నిపుణులు అభిప్రాయపడటం గమనార్హం. 

పాక్‌ను ‘గ్రే లిస్ట్‌’లో కొనసాగిస్తూ ఎఫ్‌ఏటీఎఫ్‌ ఇప్పటి వరకు రెండుసార్లు నిర్ణయం తీసుకుంది. నిధుల కట్టడి దిశగా కఠిన చర్యలు తీసుకునేందుకు పాక్‌కు గత అక్టోబర్‌లోనే అవకాశం కల్పించింది. కంటితుడుపు చర్యలతో సరిపెట్టాలని చూసిన దాయాది దేశ దుర్బుద్ధిని పసిగట్టిన ఎఫ్‌ఏటీఎఫ్‌ ‘గ్రే లిస్ట్‌’ నుంచి తప్పించకుండా గట్టి హెచ్చరికే జారీ చేసింది. అక్టోబర్‌ 2018లో తొలిసారి పాక్‌ను గ్రే లిస్ట్‌లో చేర్చింది‌. 15 నెలల సమయం ఇచ్చినప్పటికీ నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడంలో దాయాది విఫలమైంది. 

తాజాగా నిర్దేశించిన లక్ష్యాల ప్రకారం ఇమ్రాన్‌ ప్రభుత్వం ఉగ్రవాదులకు అందుతున్న నిధుల మూలాలను కనిపెట్టే దిశగా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఐరాస ఉగ్రవాదులుగా గుర్తించిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలి. అలాగే పట్టుబడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకున్నట్లు నిరూపించగలగాలి. ఐరాస గుర్తించిన ఉగ్రవాదులకు నిధులు అందకుండా ఆర్థికపరమైన ఆంక్షలు విధించాలి. కానీ, వీటిని అమలుచేయడంలో పాక్‌ ఇప్పటి వరకు పెద్దగా పురోగతి సాధించినట్లు మాత్రం సూచనలు లేవు. పీకల్లోతు ఆర్థిక కష్టాలు, ఆపై గ్రే లిస్ట్‌ కత్తి, ఇవన్నీ చాలవన్నట్లు ఇప్పుడు కరోనా మహమ్మారి.. వీటి నుంచి ఎలా బయటపడాలో పాలుపోని పాక్‌.. ఎలాగైన బ్లాక్‌ లిస్ట్‌ ముప్పు తప్పించుకునేందుకు ఇలాంటి వక్రమార్గాలను ఎంచుకుంటున్నట్లు అర్థమవుతోంది.

ఇదీ చదవండి..

చమురు ధరల పతనం.. వినియోగదారుడికి లాభమెంత?



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని