చూడలేకపోతే అది వారి సమస్య
close
Published : 21/04/2020 22:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చూడలేకపోతే అది వారి సమస్య

భారత్‌ ముస్లిములకు స్వర్గం లాంటిది: కేంద్ర మంత్రి నఖ్వీ

దిల్లీ: భారత దేశం ముస్లిములకు స్వర్గ సమానమైనదని కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ అన్నారు. దేశంలో ముస్లిములంటే భయపడే ఇస్లామోఫోబియా ఉందన్న ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కో-ఆపరేషన్‌ (ఓఐసీ) విమర్శలకు జవాబుగా ఆయన ఈ విధంగా స్పందించారు. భారత్‌లో ముస్లిముల సాంఘిక, ఆర్థిక, మతపరమైన హక్కులకు ఏ విధమైన భంగం వాటిల్లలేదని నఖ్వీ స్పష్టం చేశారు. భారత్‌లో ముస్లింల హక్కులను కాపాడి, వారిని ఇస్లామోఫోబియా నుంచి రక్షించేందుకు అత్యవసర చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఓఐసీ ఓ ప్రకటనను విడుదల చేసింది. అంతేకాకుండా దేశంలో మీడియా ముస్లింలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ, వారిపై వివక్ష చూపుతోందని కూడా ఈ సంస్థ ఆరోపించింది.

ఇందుకు మంత్రి స్పందిస్తూ తాము తమ కర్తవ్యాన్ని నిబద్ధతతో నిర్వహిస్తున్నామని... ప్రధాని ఎప్పుడు మాట్లాడినా దేశంలోని 130 కోట్లమంది భారతీయుల సంక్షేమాన్ని గురించి మాట్లాడుతారని... దానిని ఎవరైనా చూడలేకపోతే అది వారి సమస్య అని సమాధానమిచ్చారు. ‘‘భారత్‌లో ముస్లింలు సుసంపన్నంగా ఉన్నారు. ఈ వాతావరణాన్ని కలుషితం చేసేందుకు ప్రయత్నిస్తున్నవారు వారికి (ముస్లిములకు) మిత్రులు కారు.’’అని నఖ్వీ వివరించారు. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని