పాక్‌ ప్రధానికి కరోనా పరీక్షలు...!
close
Updated : 22/04/2020 15:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాక్‌ ప్రధానికి కరోనా పరీక్షలు...!

ఇస్లామాబాద్: పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆ దేశ ప్రధాని కార్యాలయం తెలిపింది. గత వారం ఇమ్రాన్‌ను కలిసిన సేవా సంస్థ అధిపతి కుమారుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఇమ్రాన్‌ఖాన్‌కు బుధవారం కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ విషయమై ఇమ్రాన్‌ఖాన్‌ వ్యక్తిగత వైద్యుడు ఫైజల్‌ సుల్తాన్‌ మాట్లాడుతూ.. ‘‘బాధ్యతగల పౌరుడిగా ప్రధాని కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటారు. ఇందుకు ఆయన కూడా అంగీకరించారు. పరీక్షల నిర్వహణకు ప్రోటోకాల్‌ను అనుసరిస్తాం. తర్వాత ఫలితాల ఆధారంగా ప్రధానికి సూచనలు చేస్తాం. ఇప్పటికే ప్రధాని కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా వారికి ఫలితాల్లో కరోనా నెగటివ్ వచ్చింది’’ అని తెలిపారు. 

పాకిస్థాన్‌లోని ప్రముఖ దాతృత్వ సంస్థ ఈదీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడి అబ్దుల్ సత్తార్‌ ఈదీ కుమారుడు ఫైజల్ ఈదీ, కరోనాపై పోరుకు విరాళంగా కోటి రూపాయల చెక్కును అందించేందుకు గత వారం ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను కలిశాడు. తాజాగా ఈదీకి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అవడంతో, ఇమ్రాన్‌కు కూడా బుధవారం కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. పాకిస్థాన్‌లో బుధవారం ఒక్క రోజే 533 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ దేశంలో కరోనా కేసుల సంఖ్య 9,749కి చేరింది. వీరిలో 209 మంది మరణించారు.

ఇవీ చదవండి:

ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్ల నాణ్యతపై స్పందించిన చైనా

కరోనా వైరస్‌ చైనాలో ఎక్కడ, ఎలా తయారు చేశారో..మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని