పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు కరోనా రోగులు?
close
Updated : 23/04/2020 16:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు కరోనా రోగులు?

శ్రీనగర్‌: కరోనా వైరస్‌ సోకిన వ్యక్తులను భారత్‌కు తరలించేందుకు పాకిస్థాన్‌ ప్రయత్నిస్తోందని జమ్మూకశ్మీర్‌ డీజీపీ వెల్లడించారు. ముఖ్యంగా కశ్మీర్‌ లోయలో ఈ తరహా ప్రయత్నాలు పాకిస్థాన్‌ చేస్తోందని జమ్మూకశ్మీర్‌ డీజీపీ దిల్‌బాగ్‌ సింగ్‌ తాజాగా వెల్లడించారు. శ్రీనగర్‌కు 20కి.మీ దూరంలో ఉన్న గాందెర్‌బాల్‌ జిల్లాలో కొవిడ్‌-19 క్వారంటైన్‌ కేంద్రాన్ని పరిశీలించిన సందర్భంగా ఆయన‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు ఉగ్రవాదులను తరలిస్తున్న పాకిస్థాన్‌, తాజాగా కొవిడ్‌ రోగులను కశ్మీర్‌లోకి చేరవేస్తోందని అన్నారు. కశ్మీర్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి చేసేందుకే ఇలాంటి ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టమైన సమాచారం ఉందన్నారు. ముఖ్యంగా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోనుంచి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించామని వెల్లడించారు. ఈ పరిణామాలు తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయని..ఈ సమయంలో మనమంతా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన కచ్చితమైన నిఘా సమాచారం ఉందని గతవారమే భారత సైన్యాధిపతి జనరల్‌ ఎంఎం నరవణే ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఇప్పటివరకు జమ్మూకశ్మీర్‌లో 400కొవిడ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇక పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో 50మంది ఈ వైరస్‌ బారినపడ్డట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే..పాకిస్థాన్‌లో ఇప్పటివరకు 10,513 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 224మంది మృత్యువాతపడ్డారు. కేవలం నిన్న ఒక్కరోజే 742కేసులు నిర్ధారణ అయినట్లు అక్కడి ఆరోగ్య శాఖ ప్రకటించింది.

ఇవీ చదవండి..

పాకిస్థాన్‌ తీరు దురదృష్టకరం: భారత ఆర్మీ చీఫ్‌

ఉగ్రవాద ఎగుమతిలో పాక్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని