భారత్‌పై ఆరోపణలు హద్దులు మీరాయి‌..!
close
Updated : 29/04/2020 10:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌పై ఆరోపణలు హద్దులు మీరాయి‌..!

యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ పరిశీలనల్ని ఖండించిన భారత్‌

వాషింగ్టన్‌: భారత్‌లో మైనారిటీల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన ‘యూఎస్‌ కమిషన్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌‌ రిలీజియస్‌ ఫీడ్రం’(యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌) నివేదికను భారత్‌ తీవ్రంగా ఖండించింది. భారత్‌ విషయంలో కమిషన్‌ చేసిన పరిశీలన అర్థరహితమని స్పష్టం చేసింది. ‘‘భారత్‌ పట్ల ఇలాంటి పక్షపాత, ఉద్దేశపూర్వకమైన వైఖరి ఇది కొత్తేమీ కాదు. కానీ, ఇలా తప్పుడు ఆరోపణలు చేయడం ఈసారి మరీ తీవ్ర స్థాయికి చేరింది’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. భారత్‌పై ఆరోపణల విషయంలో సొంత కమిషనర్ల మద్దతునే యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ కూడగట్టలేకపోయిందని కుండబద్దలు కొట్టారు. 

మంగళవారం విడుదల చేసిన యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ నివేదికలో భారత్‌లో మైనారిటీల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. చైనా, పాకిస్థాన్‌, ఉత్తర కొరియా, ఇరాన్‌, సౌదీ అరేబియా, తుర్క్‌మెనిస్థాన్‌, తజికిస్థాన్‌, నైజీరియా, రష్యా, సిరియా, వియత్నాం సరసన విడ్డూరంగా భారత్‌ను కూడా ‘ఆందోళనకర దేశాల’ జాబితాలో చేర్చింది. 2019లో భారత్‌లో మైనారిటీల పరిస్థితి దిగజారిందంటూ బాధ్యతారాహిత్య వాఖ్యలు చేసింది. సంబంధిత శాఖలు, సంస్థలు, యంత్రాంగాలపై ఆంక్షలు విధించాలని అక్కడి విదేశాంగ శాఖను కోరడం కమిషన్‌ అవగాహనారాహిత్యానికి నిదర్శనం. ఇలా భారత్‌పై ఈ కమిషన్‌ ఆరోపణలు చేయడం ఇది కొత్తేమీ కాదు. గతంలో పౌరసత్వ సవరణ చట్టం, అధికరణ 370 రద్దు సమయంలోనూ అర్థంలేని ఆరోపణలు చేసింది.  

అయితే భారత్‌పై చేసిన అర్థరహిత పరిశీలనలతో యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌లోని తొమ్మిది మంది కమిషనర్లలో ఇద్దరు ఏకీభవించకపోవడం గమనార్హం. ‘‘అత్యంత కఠిన దేశాల సరసన భారత్‌ను చేర్చాలన్న కమిషన్‌ సభ్యుల ప్రతిపాదనపై నేను అసమ్మతి వ్యక్తం చేస్తున్నాను’’ అంటూ కమిషనర్‌ గేరీ బాయిర్‌ భారత్‌కు మద్దతుగా నిలిచారు. మరో కమిషనర్‌ తెన్‌జిన్‌ డోర్జీ మాట్లాడుతూ.. ‘‘చైనా, ఉత్తరకొరియా వంటి నియంతృత్వ దేశాల సరసన భారత్‌ను చేర్చడం సరికాదు. పౌరసత్వ సవరణ చట్టంపై భారత్‌లోని విపక్ష కాంగ్రెస్‌ సహా ఇతర ప్రజాప్రతినిధులు స్వేచ్ఛగా తమ అసమ్మతి వ్యక్తం చేశారు’’ అంటూ భారత్‌లో ఉన్న వాస్తవ పరిస్థితిని వివరించారు.

 

ఇవీ చదవండి..

చైనాపై ఆధారపడొద్దు..!

స్త్రీలకంటే పురుషులకే ఎక్కవగా కరోనా..ఎందుకో తెలుసా?మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని