కిమ్‌ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన ఐరాస!
close
Updated : 01/05/2020 12:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కిమ్‌ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన ఐరాస!

న్యూయార్క్‌: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఆరోగ్యంపై అనేక వదంతులు చక్కర్లు కొడుతున్న వేళ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ఈ విషయంపై స్పందించారు. కిమ్‌ ఆరోగ్య పరిస్థితిపై తమకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంపై ఐరాస ప్రతినిధులెవరూ ఉత్తరకొరియా ప్రభుత్వాన్నిగానీ, ఆ దేశ ప్రతినిధులతోగానీ మాట్లాడలేదని తెలిపారు. ఏప్రిల్‌ 15న తన తాత కిమ్‌ ఇల్‌ సంగ్‌ జయంతి వేడుకలకు గైర్హాజరైనప్పటి నుంచి కిమ్‌ ఆరోగ్య పరిస్థితిపై అనేక ఊహాగానాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. గుండె సంబంధిత శస్త్రచికిత్స చేస్తుండగా.. ఆయన కోమాలోకి వెళ్లారన్న వార్త చక్కర్లు కొట్టింది. ఇప్పటి వరకు ఈ విషయాన్ని ఆ దేశం అధికారికంగా ఖండించకపోవడం గమనార్హం. అయితే, దక్షిణ కొరియా మాత్రం కిమ్‌ ఆరోగ్యంగానే ఉన్నారని ప్రకటించింది. మరోవైపు కిమ్‌ ఆరోగ్య పరిస్థితిపై తనకు పూర్తి సమాచారం ఉందని.. కానీ, బయటకు చెప్పలేనని ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. 

కొవిడ్‌-19పై పోరులో అమెరికా, చైనా పాత్ర కీలకం..

కొవిడ్‌-19పై పోరులో అంతర్జాతీయ స్థాయిలో చైనా, అమెరికా పాత్ర చాలా కీలకమైనదని గుటెరస్‌ అభిప్రాయపడ్డారు. అలాగే కరోనా వైరస్‌ మెడలు వంచడంతో పాటు ప్రపంచ దేశాల అభివృద్ధికి వీరివురి సహకారం చాలా అవసరమని వ్యాఖ్యానించారు. రాజకీయంగా, ఆర్థికంగా, రక్షణపరంగా ఈ ఉభయ దేశాలు కీలక పాత్ర పోషించగలవని అభిప్రాయపడ్డారు. కానీ, కరోనా వైరస్‌ వ్యాప్తి విషయంలో ఇరు దేశాలు పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్న విషయం తెలిసిందే.

ఇవీ చదవండి..

కిమ్‌ బాల్యం ఓ రహస్యం

కిమ్‌ ‘సజీవం’గా ఉన్నారు

పెద్ద’ కిమ్‌ మృతిపై అప్పట్లోనూ వార్తలే వార్తలు


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని