రష్యా ప్రధాని త్వరగా కోలుకోవాలి: మోదీ
close
Published : 01/05/2020 12:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రష్యా ప్రధాని త్వరగా కోలుకోవాలి: మోదీ

దిల్లీ: కరోనా వైరస్‌ బారినపడిన రష్యా ప్రధానమంత్రి మైఖేల్‌ మిషుస్తిన్‌ త్వరగా కోలుకోవాలని భారత ప్రధాని నరేంద్రమోదీ ఆకాంక్షించారు. ఈ సమయంలో కరోనా వైరస్‌పై రష్యా చేస్తున్న పోరులో భారత్‌ అన్ని విధాల తోడ్పాడునందిస్తుందని మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. 54ఏళ్ల మిషుస్తిన్‌ కరోనా వైరస్‌ బారినపడినట్లు స్వయంగా తానే వెల్లడించారు. ఈ విషయాన్ని రష్యా అధ్యక్షుడు పుతిక్‌కు తెలుపుతూ..స్వీయ నిర్బంధంలో ఉండనున్నట్లు ప్రకటించారు. కాగా మిషుస్తిన్‌ ఈ ఏడాది జనవరిలోనే రష్యా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 

రష్యాలో కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. గడచిన 24 గంటల్లో దేశంలో 7099 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశ రాజధాని మాస్కోలో తీవ్రత అధికంగా ఉంది. ఇప్పటివరకు రష్యాలో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటగా 1073 మంది మృత్యువాతపడ్డారు. ఏప్రిల్‌ 1న మూడు వేలుగా ఉన్న కేసుల సంఖ్య మే1 నాటికి లక్ష చేరడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్‌ బారినపడ్డవారి సంఖ్య 33లక్షలకు చేరింది. వీరిలో 2లక్షల 3వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇవీ చదవండి..

భారత్‌లో 35వేల బాధితులు, 1147మరణాలు

కరోనా వైరస్ మానవ సృష్టి కాదు

 

 



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని