భారత్ చర్యలపై ప్రపంచాన్ని హెచ్చరిస్తున్నా: పాక్‌
close
Published : 07/05/2020 12:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్ చర్యలపై ప్రపంచాన్ని హెచ్చరిస్తున్నా: పాక్‌

ఇస్లామాబాద్: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలు హిజుబుల్‌ ముజాహిదీన్‌ కమాండర్ రియాజ్‌ నాయకూను మట్టుపెట్టడం ఇప్పుడు పాకిస్థాన్‌కు కంటగింపుగా మారింది. తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి భారత్‌ మీద ఎదురుదాడికి దిగింది. ప్రస్తుతం నెలకొన్న క్లిష్ట పరిస్థితులను అడ్డం పెట్టుకొని చొరబాట్ల నెపంతో భారత్ తప్పుడు ఆపరేషన్లు చేస్తోందని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోపణలే ఇందుకు నిదర్శనం. కశ్మీర్‌లో అస్థిరత్వానికి పాక్‌ కారణమన్న మనదేశం విమర్శలను తోసిపుచ్చుతూ ట్వీట్‌ చేశారు.

‘పాకిస్థాన్‌ను లక్ష్యంగా చేసుకొని భారత్ నిరంతరం చేపడుతున్న తప్పుడు ఆపరేషన్ల గురించి ప్రపంచాన్ని హెచ్చరిస్తున్నాను. నియంత్రణ రేఖ వెంబడి చొరబాట్లు అంటూ తాజాగా చేసిన నిరాధారమైన ఆరోపణలు భారత్‌ తప్పుడు అజెండాకు కొనసాగింపు’ అని ఇమ్రాన్‌ తమ తప్పును కప్పి పుచ్చుకొనే ప్రయత్నం చేశారు. కశ్మీర్‌లో జరిగిన అల్లర్లు స్థానికమైనవని ఆయన చెప్పుకొచ్చారు. మరోసారి భారత్‌లోని అధికార పార్టీ నిర్ణయాలను నిందించారు. వాటి వల్ల దక్షిణాసియాలో శాంతికి భంగం కలుగుతుందన్నారు. అక్కడి ప్రతిపక్ష పార్టీ పీఎంఎల్‌(ఎన్‌) కూడా మనదేశం మీద విమర్శలు చేసింది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని