భారత సరిహద్దులో చైనా హెలికాప్టర్ల చక్కర్లు!
close
Published : 12/05/2020 18:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత సరిహద్దులో చైనా హెలికాప్టర్ల చక్కర్లు!

దిల్లీ: భారత్‌-చైనా సరిహద్దుల్లో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. సిక్కింలోని నకులా సెక్టార్‌లో జరిగిన సంఘటన మరువక ముందే లద్దాఖ్‌ ప్రాంతంలో చైనా బలగాలు మరోసారి ప్రత్యక్షమయ్యాయి. లద్దాఖ్‌లోని వాస్తవాదీన రేఖ (ఎల్‌ఏసీ) సమీపంలో చైనా సైనిక బలగాలు హెలికాప్టర్లతో చెక్కర్లు కొట్టిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో అప్రమత్తమైన భారత వైమానిక దళం ఫ్లైటర్‌ జెట్‌లతో తిప్పికొట్టింది. గతకొన్నిరోజుల క్రితం నకులా సెక్టార్‌లో భారత్‌-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ వాతావరణం సమయంలోనే ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. భారత్‌ను రెచ్చగొట్టేందుకు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఆ సమయంలో ఎల్‌ఏసీని దాటి భారత్‌ భూభాగంలోకి రాలేదని భారత అధికారులు స్పష్టంచేశారు.  సాధారణంగా భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్‌ 30ఎంకేఐ యుద్ధ విమానాలు సాధారణంగా లద్దాఖ్‌ ఎయిర్‌ బేస్‌ను ఉపయోగించుకుంటాయి.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని